BigTV English

RGV on Allu Arjun Arrest : ‘పుష్ప2’తో ఇండస్ట్రీ హిట్ ఇస్తే… జైలుకు పంపించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు

RGV on Allu Arjun Arrest : ‘పుష్ప2’తో ఇండస్ట్రీ హిట్ ఇస్తే… జైలుకు పంపించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు

RGV on Allu Arjun Arrest  : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం చేసినా సరే అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇప్పుడు సెన్సేషన్ గా మారిన అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ విషయంపై ఎప్పటికప్పుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు’ అంటూ వర్మ చేసిన సెటైరికల్ పోస్ట్ వైరల్ గా మారింది.


దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూసిన ‘పుష్ప 2 ‘ (Pushpa 2) మూవీ రిలీజ్ కావడం, 6 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టడం సంచలనం సృష్టించింది. కానీ ఈ గుడ్ న్యూస్ ని ఎంజాయ్ చేసేలోపే, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అన్న వార్త టాలీవుడ్ ని షేక్ చేసింది. సంధ్య థియేటర్ దగ్గర ‘పుష్ప 2’ ప్రీమియర్ల సందర్భంగా తొక్కిసలాట జరగగా, అందులో రేవతి అనే మహిళ ప్రమాదవశాత్తు మరణించడం, ఆమె కొడుకు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలవ్వడం తెలిసిందే.

అయితే అల్లు అర్జున్ ఈ విషాదం పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారంగా ఇస్తానని అప్పుడే ప్రకటించారు. పైగా ఆ కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చారు. కానీ ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. దీంతో పోలీసులు ఘటనకు బాధ్యులంటూ సంధ్య థియేటర్ ఓనర్ తో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ ను విచారించడానికి శుక్రవారం అరెస్ట్ చేశారు పోలీసులు.


ఇక ఆ తర్వాత క్షణక్షణానికి ఓ ట్విస్ట్ అన్నట్టుగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఉదయమే అల్లు అర్జున్ జైల్ నుంచి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ను పరామర్శించడానికి పలువురు ప్రముఖ హీరోలు ఆయన ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఒక్క మెగా హీరోలు తప్ప. ఇక ‘పుష్ప 2’ రిలీజ్ కి ముందు నుంచి అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ తీవ్రమైన నెగిటివ్ కామెంట్స్ చేస్తుండగా, ఆయనకు అండగా ఉన్నారు రామ్ గోపాల్ వర్మనే. సోషల్ మీడియా వేదికగా ఆయన అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అన్న విషయం తెలిసిన తర్వాత కూడా రాంగోపాల్ వర్మ “అధికారులకు నా నుంచి నాలుగు ప్రశ్నలు. వాటికి సమాధానం చెప్పండి” అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అరెస్ట్ పై అధికారులను ప్రశ్నించారు. ఇక తాజాగా ఆయన “అల్లు అర్జున్ బిగ్గెస్ట్ ఇండియా స్టార్. అలాంటి స్టార్ తెలంగాణలో నివాసం ఉంటున్నాడు. భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ ను ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి అతను గొప్ప బహుమతిని అందించారు. కానీ తెలంగాణ రాష్ట్రం అతనిని జైలుకు పంపించి అంతకంటే గొప్ప రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది” అంటూ సెటైరికల్ గా పోస్ట్ చేశారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×