NTR-Neel: ప్రస్తుతం జూనియర్ (Junior NTR) ఎన్టీఆర్ జపాన్‌లో “దేవర: పార్ట్ 1” (Devara: Part 1) సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జపనీస్ వెర్షన్ మార్చి 28, 2025న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva)తో కలిసి ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నాడు తారక్. ఇక జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో జాయిన్ అవవనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గి, కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. స్లిమ్‌గా స్టైలిష్ట్‌గా రఫ్ గడ్డంతో మస్త్ కపిపిస్తున్నాడు టైగర్. జపాన్‌లో కనిపిస్తున్న ఎన్టీఆర్ లుక్ చూసి, ఇది ప్రశాంత్ నీల్ సినిమా కోసమేనని అంతా ఫిక్స్ అయిపోయారు. దీంతో.. ఎన్టీఆర్-నీల్ (NTR-Neel) సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. ఈ సమయంలో ప్రశాంత్ నీల్ భార్య లిఖిత షేర్ చేసిన ఫోటో చర్చకు దారి తీసింది.
Also read: అజ్ఞాతవాసి వల్ల చాలా డబ్బులు వచ్చాయి… డిజాస్టర్ మూవీ లెక్క చెప్పిన నిర్మాత
ప్రశాంత్ నీల్ భార్య ఇచ్చిన హైప్
రీసెంట్‌గా ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి నీల్ (Likitha reddy neel) ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్‌లతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్‌లో నవ్వుతూ, సరదాగా సంభాషిస్తూ కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా.. వీరిద్దరినీ చూస్తుంటే కేవలం భయం అనే ఒకే ఒక్క మాట గుర్తుకు వస్తోందనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే.. ఈ ఫోటోలో గమనించాల్సింది ఒకటుంది. ఎన్టీఆర్, నీల్ చిల్ అవుతున్నారనేది క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది. ఇద్దరు టేబుల్ పైన చేతులు పెట్టుకొని ఉండగా.. కింద మాత్రం సిగరేట్ ప్యాక్, ఓ గ్లాస్ కపిస్తోంది. ఆ సమయంలో ఆ గ్లాస్‌లో ఉంది ఆల్కహాలా? జ్యూసా? లేదా శీతల పానియమా? అనే క్లారిటీ లేదు కానీ, ప్రశాంత్ నీల్ గతంలో చేసిన కామెంట్స్‌ను మాత్రం ఈ పిక్ గుర్తు చేసేలా ఉందని అంటున్నారు అభిమానులు.
Also read: అజ్ఞాతవాసి వల్ల చాలా డబ్బులు వచ్చాయి… డిజాస్టర్ మూవీ లెక్క చెప్పిన నిర్మాత
గతంలో ప్రశాంత్ నీల్.. మందు తాగి కథలు రాస్తాను
గతంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతు.. తనకు మద్యం తాగే అలవాటుందనే విషయాన్ని బయటపెట్టాడు. తాను మద్యం సేవిస్తానని, మందు తాగుతూనే కథలు రాస్తుంటానని చెప్పుకొచ్చాడు. మత్తులో ఉన్నప్పుడు కూడా సినిమాలో సన్నివేశాల గురించి ఆలోచన చేస్తుంటానని.. ఫలానా సన్నివేశాం అవసరమా? లేదా? అనేది నిర్ధారిస్తుంటానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్లో ప్రశాంత్ నీల్ ఉన్న ఫోటో కూడా ఇదే గుర్తు చేస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఫోటోను షేర్ చేస్తూ.. నీల్ మావా అవసరమైతే ఫుల్ బాటిల్ తాగు కానీ, ఎన్టీఆర్‌తో మాత్రం అదిరిపోయే బ్లాక్ బస్టర్ సినిమా తీయమని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్. అసలే.. ఇది ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. పైగా ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ అభిమాన నటుడు. కాబట్టి.. ఈసారి ప్రశాంత్ నీల్ నుంచి రాబోయే సినిమా కెజియఫ్, సలార్‌కు మించి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. 1960 పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో.. కొలకతా (Kolkata) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్నట్టు ఈ సినిమాకు డ్రాగన్ (Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది.