Lokesh Kanagaraj: ఒక ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న దర్శకులు ఎవరైనా కూడా ఒకసారి ఒక సినిమాపై మాత్రమే దృష్టిపెడతారు. ఒకేసారి రెండు, మూడు ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయడంకంటే ఒకే ప్రాజెక్ట్‌పై ఎక్కువ సమయం కేటాయించడం బెటర్ అనుకుంటారు. కానీ యంగ్ డైరెక్టర్లు అలా కాదు.. ఒకేసారి రెండు సినిమాలను కూడా హ్యాండిల్ చేయొచ్చనే నమ్మకంతో ఉంటారు. తాజాగా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ కూడా అదే చేస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్‌తో ‘కూలి’ సినిమా చేస్తున్న లోకేశ్.. మరో ప్రాజెక్ట్‌ను ఓకే చేసి అందరికీ షాకిచ్చాడు. దాని అనౌన్స్‌మెంట్ వీడియో తాజాగా విడుదలయ్యింది.
నిర్మాతగా సినిమా
లోకేశ్ కనకరాజ్ ‘కూలి’ (Coolie)ని పక్కనపెట్టి మరొక సినిమాను అయితే డైరెక్ట్ చేయడం లేదు. కానీ ప్రొడక్షన్‌లోకి దిగుతున్నాడు. త్వరలోనే తను నిర్మాతగా ‘మిస్టర్ భరత్’ అనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు తానే నిర్మాత అని ప్రకటించడం కోసం లోకేశ్ కనకరాజ్ స్వయంగా రంగంలోకి దిగాడు. మామూలుగా లోకేశ్ కనకరాజ్ సినిమా అంటే అనౌన్స్‌మెంట్ వీడియోలు ఒక రేంజ్‌లో ఉంటాయి. అంతే కాకుండా ఆ మూవీ జోనర్ ఏదైనా అనౌన్స్‌మెంట్ వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది. ‘మిస్టర్ భరత్’ అనౌన్స్‌మెంట్ వీడియో కూడా అలాగే ఉంది. ఈ సినిమాకు రైటర్, డైరెక్టర్‌గా పనిచేస్తున్న నిరంజన్ కూడా ఈ వీడియోలో ఉన్నాడు.
Also Read: దయచేసి రూమర్స్ ను నమ్మొద్దు.. రాజా సాబ్ టీమ్ రిక్వెస్ట్
అనౌన్స్‌మెంట్ వీడియో
ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలో లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) ఒక గ్యాంగ్ లీడర్‌గా కనిపిస్తాడు. జీ స్క్వాడ్ అనేది తన కంపెనీ పేరుగా కనిపిస్తుంది. అసలైతే జీ స్క్వాడ్ అనేది లోకేశ్ కనకరాజ్ ప్రొడక్షన్ హౌజ్ పేరు. అందుకే ఈ సినిమా గురించి ప్రకటిస్తూ జీ స్క్వాడ్.. తన ట్విటర్‌లో ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. ‘మా తరువాతి ప్రాజెక్ట్ మిస్టర్ భరత్‌ను అనౌన్స్ చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ప్లీజ్.. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సినిమా థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది’ అంటూ అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా షేర్ చేసింది జీ స్క్వాడ్. దీంతో ఒకవైపు ‘కూలీ’, మరోవైపు ‘మిస్టర్ భరత్’తో లోకేశ్ కనకరాజ్ లైనప్ అదిరిపోయిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అనే ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసి తక్కువ సినిమాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్. అందుకే తనకు తక్కువ సినిమాల అనుభవం ఉన్నా కూడా కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలు సైతం లోకేశ్‌తో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్‌తో కలిసి ‘విక్రమ్’ అనే మూవీని తెరకెక్కించి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ప్రస్తుతం రజినీకాంత్‌తో కలిసి ‘కూలీ’ సినిమా చేస్తున్నాడు. ఇటీవల రజినీకాంత్ (Rajinikanth) బర్త్ డే సందర్భంగా ఈ సినిమా సాంగ్ ప్రోమో విడుదలయ్యింది.
We are super delighted to announce our new project titled “Mr.Bhaarath” 🔥
Please Like Share Comment 🙂🙏🏻
P.S We repeat the film will be released in theatres 👀
🔗https://t.co/lNr25IS8J7@Bhaarath_Offl @samyukthavv @Niranjan_Dir @Dir_lokesh @Sudhans2017 @Jagadishbliss… pic.twitter.com/T0mECKJ8Vp
— GSquad (@GSquadOffl) December 18, 2024