Raja Saab: ముందుగా తెలుగు హీరోల్లో పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటినుండి తన క్రేజ్‌తో పాటు సినిమాల రేంజ్ కూడా పెరిగిపోయింది. ప్రతీ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే అలాంటి సినిమాలను అందరికీ అందించడం కోసం ప్రభాస్ కష్టపడుతున్నాడు. అలా తన సినిమాలు కూడా లేట్ అవుతున్నాయి. వచ్చే ఏడాది విడుదల కావాల్సిన ‘రాజా సాబ్’ కూడా పోస్ట్‌పోన్ అవ్వక తప్పదు అనే రూమర్స్ వైరల్ కాగా దీనిపై మేకర్స్ స్పందించారు.
రూమర్స్‌పై క్లారిటీ
పాన్ ఇండియా స్టార్‌గా స్టార్‌డమ్ సంపాదించుకున్న తర్వాత మారుతి దర్శకత్వంలో నటించడానికి ప్రభాస్ ఒప్పుకున్నాడు. అసలు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయడమేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. అంతే కాకుండా ముందు నుండే ఈ ప్రాజెక్ట్‌పై నెగిటివిటీ పెంచేశారు. అయినా కూడా మారుతి తన సినిమాపై తాను నమ్మకంతో ఉన్నాడు. ‘రాజా సాబ్’ అనే టైటిల్, ప్రభాస్ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన తర్వాత ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా నమ్మకం ఏర్పడింది. ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ‘రాజా సాబ్’పై రకరకాల రూమర్స్ వస్తుండగా.. మేకర్స్ వాటిపై స్పందించారు.
Also Read: వారికి క్షమాపణలు చెప్పిన ప్రభాస్.. వీడియో వైరల్
విజిల్ కొట్టే ట్రీట్
‘రోజు రాత్రి, పగలు కష్టపడి రాజా సాబ్ షూటింగ్ షెడ్యూల్స్‌ను పూర్తిచేస్తున్నాం. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా సాగుతోంది. క్రిస్మస్ లేదా న్యూ ఇయర్‌కు రాజా సాబ్ టీజర్ విడుదల అవుతుంది అని అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ రూమర్స్ అన్నింటిని నమ్మొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్డేట్స్ అన్నీ సరైన సమయంలో అధికారికంగా ప్రకటిస్తాం’ అని ‘రాజా సాబ్’ టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. రెబెల్ సాబ్ వచ్చినప్పుడు అందరూ విజిల్ కొట్టే ట్రీట్‌తో మీ ముందుకు వస్తామంటూ ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాటిచ్చింది. దీంతో రూమర్స్‌కు చెక్ పడింది. టీజర్ త్వరలోనే వస్తుందని కూడా ‘రాజా సాబ్’ మేకర్స్ ప్రకటించారు.
ఆసక్తి పెరిగింది
ఇప్పటికీ ‘రాజా సాబ్’ (Raja Saab) మూవీ నుండి పలు పోస్టర్లతో పాటు ఒక చిన్న గ్లింప్స్ కూడా విడుదలయ్యింది. ఇంకా టీజర్ కూడా విడుదల కాకముందే ‘రాజా సాబ్’పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ముసలివాడి గెటప్‌లో ప్రభాస్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ప్రభాస్ ఇందులో ఎన్ని రోల్స్ చేస్తున్నాడు, అసలు కథేంటి అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మూవీ లవర్స్ ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కూడా పోస్ట్‌పోన్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.