Lokesh Kanagaraj: మా నగరం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్ కనకరాజ్. మొదటి సినిమాతోనే చాలామంది ఆడియన్స్ను ఇంప్రెస్ చేశాడు. లోకేష్ టేకింగ్ చాలామందికి కొత్తగా అనిపించింది. ఈ సినిమా తర్వాత లోకేష్ చేసిన ఖైదీ సినిమా మంచి పేరును తీసుకొచ్చింది. ఇక్కడితో లోకేష్ కనకరాజ్ ఒక బ్రాండ్ డైరెక్టర్ అయిపోయాడు. కార్తీ నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతమైన హై ఇచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత మాస్టర్ అనే సినిమాను చేశాడు లోకేష్. విజయ్ మరియు విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ హీరోగా చేసిన విక్రం సినిమా చాలామందికి సప్రైజ్ గా అనిపించింది. విక్రమ్ సినిమాతో ఖైదీ సినిమా లింక్ చేయటం అనేది సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్ చెప్పాలి. ఇక్కడితో లోకేష్ కనకరాజ్ రేంజ్ విపరీతంగా మారిపోయింది.
సినిమాటిక్ యూనివర్స్
ఇండియన్ సినిమాలు సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసింది లోకేష్. విక్రమ్ సినిమా చూసిన వెంటనే చాలామందికి విపరీతంగా నచ్చింది. ఆ తర్వాత లోకేష్ సినీమాటిక్ యూనివర్స్ చాలామందికి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. లోకేష్ కొన్ని పాత్రలను ఇదివరకే పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ పాత్రలు వెనుక స్టోరీని పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా లోకేష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాల్లో కీలకపాత్రలో కనిపిస్తున్నారు. అలానే నాగర్జున కూడా ఒక కీ రోల్ లో కనిపించబోతున్నారు.
Also Read : Pawan Kalyan: మా ఇంట్లో ఎవరైనా Depression అంటే తిండి మానేసి బయటకి వెళ్ళి తోటపని చెయ్యమంటా
కార్తీ తో సినిమా
కూలి సినిమా తర్వాత కార్తి హీరోగా ఖైదీ 2 సినిమాను చేయనున్నారు లోకేష్. ఈ సినిమా మీద అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఖైదీ 2 సినిమా పూర్తి చేసిన తర్వాతే సూర్యతో సినిమా చేస్తాను అంటూ తెలిపారు. విక్రమ్ సినిమాలో క్లైమాక్స్ లో వచ్చిన రోలెక్స్ పాత్ర ఎంతగా ఆకట్టుకుంది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే పాత్రతో కంప్లీట్ సినిమా చేయబోతున్నట్లు లోకేష్ తెలిపాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన దగ్గర పది సంవత్సరాలకు సరిపడా స్క్రిప్ట్స్ ఉన్నాయని లోకేష్ చెప్పిన విషయం తెలిసిందే. వాటిలో ఎక్కువ శాతం లోకేష్ సినీమాటిక్ యూనివర్స్ లో భాగమైన కథలు ఉండొచ్చు అనేది కొంతమంది అభిప్రాయం.
Also Read : AA22xA6 : ఆల్మోస్ట్ అంతా సెట్, సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే