Pawan Kalyan: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సినిమాల పైన ఆసక్తి బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు సినిమాల పైన విపరీతమైన ఆసక్తి ఉండేది. కొన్నిసార్లు ఎడిటింగ్ రూమ్ లో కూర్చుని కూడా తన సినిమాను బాగా చెక్కుతూ ఉండేవాడు. ఎడిటర్ మార్తాండ కే వెంకటేష్ తో పవన్ కళ్యాణ్ కి మంచి బాండింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకుడిగా జానీ అనే సినిమాను తీశాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి అంటే ముందు పలు సందర్భాల్లో డిప్రెషన్ గా ఉండేవాడిని అని, ఏదో చేయాలి అని కసి పట్టుదల ఉండేవి అని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చాడు.
డిప్రెషన్ ఉంటే ఇలా చేయండి
ఇప్పట్లో డిప్రెషన్ అనేది చాలామందికి యూత్ కామన్ అయిపోయింది. అయితే ఈ మెంటల్ హెల్త్ అనేదానికి ఎవరు అతీతులు కారు. పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్లకి డిప్రెషన్ వచ్చినప్పుడు. తిండి మానేసి బయటకు వెళ్లి తోట పని చేయండి అని చెబుతూ ఉంటారు అట. అలా చేయడంవల్ల ఆకలి వేస్తుంది. శ్రమజీవులు కి డిప్రెషన్ అనేది ఉండదు అంటూ పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో రీసెంట్ గానే తెలిపారు. దీనిపై విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. డిప్రెషన్ కి ఆకలికి ఏమైనా సంబంధం ఉందా.? మీరు ఇలా మాట్లాడుతుంటే మీ పైన ఉన్న గౌరవం తగ్గిపోతుంది. ఇంటర్ చదువుకున్నారు కదా ఇంతకన్నా మీకు ఏం తెలుస్తుందిలే అని కొంతమంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
వరుస సినిమాలు
ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ప్రస్తుతం మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఓజి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీని కారణం స్వతహాగా సుజిత్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడం. ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోయే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు తనని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మక చిత్రంగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తిచేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది.
Also Read : Allu Arjun: దారిలోకి వచ్చిన బన్నీ… చిరు మావయ్యే నాకు అన్నీ అంటూ… స్టేజ్ పైనే….