AA22xA6 : ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్ లో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే సినిమా కూడా ఒకటి. ఈ సినిమా మీద విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి. దీనికి కారణం పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడం. పుష్ప సినిమా ఏ స్థాయి హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. పుష్ప సినిమా తర్వాత వచ్చిన పుష్ప 2 సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది. ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంకా పుష్ప సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆల్మోస్ట్ అందరూ అదే సినిమా పట్టాలెక్కుతుంది అని ఊహించారు. కానీ ఊహించిన విధంగా ఈ లీగ్ లోకి అట్లీ జాయిన్ అయ్యాడు.
షూటింగ్ మొదలు పెట్టేది అప్పుడే
అఖిల్ గురించి తెలుగు ప్రేక్షకులు కూడా తెలుసు. రాజా రాణి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన అట్లీ వరుసగా హిట్ సినిమాలు చేసుకుంటూ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. రాజా రాణి సినిమా తర్వాత విజయ్ హీరోగా వరుసగా సినిమాలు చేశాడు అట్లీ. అట్లీ దర్శకత్వంలో విజయ్ చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఇక బాలీవుడ్ లో కూడా దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి జవాన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్తో చేయబోయే సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్లు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలుకానుంది. ఎలా అయినా సరే జూన్ లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్.
Also Read : Pawan Kalyan: మా ఇంట్లో ఎవరైనా Depression అంటే తిండి మానేసి బయటకి వెళ్ళి తోటపని చెయ్యమంటా.
భారీ రెమ్యూనరేషన్
ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ 175 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలానే అట్లీ 125 కోట్లు తీసుకుంటున్నారు అని సమాచారం అనిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిన విషయమే. సినిమా కొంచెం బాగున్నా కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ లోపు త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం వినిపిస్తుంది.
Also Read : Allu Arjun : దారిలోకి వచ్చిన బన్నీ… చిరు మావయ్యే నాకు అన్నీ అంటూ… స్టేజ్ పైనే….