Aishwarya Rai: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్.. తన ఫ్యామిలీ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను ఎక్కువ ప్రైవేట్‌గా ఉంచుకోవడానికి ఇష్టపడుతుంది. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, వాటి గురించి అందరికీ తెలిసేలా చేయడం తనకు పెద్దగా నచ్చదు. అందుకే తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించింది అయినా, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించింది అయినా ఇతరుల ద్వారానే బయటపడుతుంది. అలాగే తాజాగా ఐశ్వర్య రాయ్ కారును ఒక బస్సు ఢీ కొట్టిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించి పలు వీడియోలు కూడా ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది.?
ఐశ్వర్య కనిపించలేదు
ముంబాయ్ రోడ్లపై ఐశ్వర్య రాయ్ కారును ఒక బస్సు వెనక నుండి ఢీ కొట్టింది. దీంతో అక్కడ స్థానికులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కారును వెనక నుండి ఢీ కొట్టినా కూడా కారుకు గానీ, అందులో ఉన్నవారికి గానీ ఏం జరగలేదని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ ఆ కారులో ఐశ్వర్య రాయ్ ఉందా, ఉంటే తను ఒంటరిగా ఉందా, ఫ్యామిలీతో ఉందా అనే విషయాలు ఇంకా బయటపడలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఐశ్వర్య రాయ్ కారును వెనక నుండి ఒక రెడ్ కలర్ బస్సు ఢీ కొట్టినట్టు కనిపిస్తోంది. దీంతో వెంటనే తనకు సంబంధించిన స్టాఫ్ బయటికి వచ్చారు. కానీ ఐశ్వర్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ వీడియో చూసిన వారంతా అది ఐశ్వర్య కారే అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.
ప్రకటన ఇవ్వాల్సింది
వీడియోలో చూసినంత వరకు ఐశ్వర్య రాయ్ కారుకు కూడా పెద్దగా డ్యామేజ్ జరగలేదని తెలుస్తోంది. కాసేపు కారు అక్కడే ఆగినా.. స్టాఫ్ దిగి కారుకు డ్యామేజ్ జరగలేదని చూసిన తర్వాత వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయారు. 5050 నెంబర్ ఉన్న కారు బచ్చన్ ఫ్యామిలీకి చెందిందే అని, దానిని ఐశ్వర్య రాయే ఉపయోగిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వీడియోలో ఉన్నదాని ప్రకారం ఎవరికీ ఏం ప్రమాదం జరగలేదని స్పష్టమవుతున్నా ఐశ్వర్య నుండి దీనిపై అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తను బాగానే ఉందని చెప్పి ఒక ప్రకటన విడుదల చేస్తే తమకు రిలీఫ్‌గా ఉంటుందని అనుకుంటున్నారు.
Also Read: కోలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ దుర్మార్గం.. నటి 14 నిమిషాల వీడియో లీక్..
చివరిగా అప్పుడే
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండని ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai).. చివరిగా తన కుటుంబంతో కలిసి అషుతోష్ గోవార్కర్ కుమారుడు కోనార్క్ గోవార్కర్ పెళ్లిలో కనిపించింది. మార్చి మొదట్లో కోనార్క్ గోవార్కర్.. నియతీ కనాకియాను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి బచ్చన్ ఫ్యామిలీ మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో చాలామంది బడా సెలబ్రిటీలు హాజరయ్యారు. ఎప్పటినుండో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకంటారని బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. వారు మాత్రం ఇలాంటి సెలబ్రిటీ వెడ్డింగ్స్, ఈవెంట్స్‌కు కలిసి హాజరవుతూ ఆ రూమర్స్‌ను ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉన్నారు. కోనార్క్ గోవర్కర్ పెళ్లిలో ఈ కపుల్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.