Singer Kalpana : సీనియర్ సింగర్ కల్పన రాఘవేందర్ (Singer Kalpana) ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిందనే వార్త నిన్నటి నుంచి టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందంటూ డాక్టర్స్ హెల్త్ బులిటిన్ రిలీజ్ చేశారు. ఇక తల్లి అనారోగ్యం పాలయ్యిందన్న విషయం తెలుసుకున్న ఆమె కూతురు, తాజాగా హైదరాబాద్ కు వచ్చింది. కల్పనాను ఆసుపత్రిలో పరామర్శించింది ఆమె కూతురు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన తల్లి సూసైడ్ చేసుకోవాలి అనుకోలేదు అంటూ వివరణ ఇచ్చారు.
కల్పనాది సూసైడ్ కాదంటూ ట్విస్ట్
కల్పన కూతురు ఈ మేరకు మీడియా ముఖంగా మాట్లాడుతూ “మా అమ్మ సూసైడ్ చేసుకోవాలి అనుకోలేదు. ఓవర్డోస్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. మా అమ్మ, నాన్న, నేను అందరం సంతోషంగా ఉన్నాము. తొందర్లోనే మేమంతా మళ్లీ ఎప్పటిలాగే మేము ముందుకు వస్తాము” అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కూతురేమో అసలు తల్లిది ఆత్మహత్య కాదని అంటోంది. మరోవైపు కూతురు వల్లే కల్పనా ఆత్మహత్య చేసుకుందని టాక్ నడుస్తోంది. దీంతో కల్పనా విషయంలో అసలేం జరుగుతోంది అన్నది అయోమయంగా మారింది.
కల్పనా ఆత్మహత్యాయత్నానికి కూతురే కారణమా ?
కల్పనా స్పృహ కోల్పోయినప్పటి నుంచి ఆమె హెల్త్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అందులో ఓ వర్గం వారు ఆమె రెండో భర్త ప్రభాకర్ పై అనుమానం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు తన కూతురు కారణంగానే ఆమె ఇలాంటి పని చేసిందని ప్రచారం జరుగుతుంది. అయితే పోలీసులు ముందుగానే భార్యాభర్తల మధ్య ఏమన్నా మనస్పర్థలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ మేరకు ఆయనను అదులోకి కూడా తీసుకున్నారు.
అయితే మరోవైపు కూతురు వల్లే కల్పన ఆత్మహత్య ప్రయత్నం చేసిందని అంటున్నారు. కల్పనా పెద్ద కూతురు స్టేట్మెంట్ ను ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేయగా, ఆమె కేరళ నుంచి హైదరాబాద్ కు రమ్మంటే రాకపోవడం వల్లే కల్పనా మనస్తాపం చెందిందని టాక్ నడుస్తోంది. రూమర్స్ ప్రకారం ఇప్పటికే తల్లి కూతుర్లకు ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరగగా, కేరళ వెళ్ళిన సందర్భంలో కూడా దీనిపై మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తోంది.
అయితే హైదరాబాద్ కు వచ్చాక మరోసారి కూతుర్ని కల్పన హైదరాబాద్ రావాలని కోరిందట. కానీ ఆమె తన మాట వినట్లేదని డిస్టర్బ్ అయిన కల్పనా ఇలాంటి పని చేసిందని అంటున్నారు. కేరళలో చదువుతున్న మొదటి భర్త కూతురు హైదరాబాద్లో చదువును కొనసాగించాలనేది కల్పన కోరికట. కానీ ఎన్నిసార్లు చెప్పినా కూతురు తన మాట వినకపోవడంతో డిస్టర్బ్ అయిన ఆమె నిద్ర మాత్రలు వేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా స్వయంగా కల్పన కూతురు మీడియా ముందుకు వచ్చి, తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, తన తల్లిది సూసైడ్ కాదని ట్విస్ట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
మా అమ్మ సూసైడ్ చేసుకోవాలి అనుకోలేదు: కల్పన కూతురు
ఓవర్ డోస్ వల్లే అస్వస్థతకు గురయ్యారు
మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు
తొందర్లోనే మళ్లీ ఎప్పటిలాగా మీ ముందుకు వస్తారు
– కల్పన కూతురు https://t.co/4sFOIR0Xb9 pic.twitter.com/rwZkO7ZHNb
— BIG TV Breaking News (@bigtvtelugu) March 5, 2025