Yuzvendra Chahal: టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ యుజువెంద్ర చాహల్, అతడి భార్య ధన శ్రీ వర్మ విడిపోతున్నారని గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ రూమర్లకు ఊతం ఇచ్చే విధంగా ఇప్పటికే ఈ జంట ఇంస్టాగ్రామ్ లో ఒకరిని ఒకరు అన్ ఫాలో కూడా చేసుకున్నారు. ఇక చాహల్ {Yuzvendra Chahal} ఏకంగా తన భార్య ఫోటోలను అన్నింటినీ డిలీట్ చేశాడు. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
Also Read: Jasprit Bumrah: SENA దేశాలపై చరిత్ర సృష్టించిన బుమ్రా..ఆసీయాలోనే తొలి ప్లేయర్ గా !
కానీ చాహల్ భార్య ధనశ్రీ మాత్రం చాహల్ ఫోటోలని డిలీట్ చేయలేదు. ధనశ్రీ వర్మ తన పేరులో చాహల్ అనే పదాన్ని 2023 లోనే తొలగించింది. అప్పటినుండే వీరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అంతేకాదు గత కొద్ది నెలలుగా వీరు విడివిడిగా ఉంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ధనశ్రీ – చాహల్ విడాకులు తీసుకోవడం ఖాయం అనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ వీరు ఎందుకు విడిపోతున్నారు అనేది మాత్రం ఇంకా తెలియ రాలేదు.
ఈ జంట ప్రేమ ఎలా మొదలైంది, పెళ్లి ఎలా జరిగింది అనే విషయాలను గతంలో ధన శ్రీ వర్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 2020 కరోనా లాక్ డౌన్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న చాహల్ {Yuzvendra Chahal} డాన్స్ నేర్చుకోవాలని అనుకున్నాడట. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ధనశ్రీ వీడియోలు చూసి చాహల్ ఆమెని సంప్రదించాడు. అయితే ధనశ్రీ ఆన్ లైన్ లోనే చాహల్ కి డ్యాన్స్ నేర్పించింది.
అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆ తర్వాత 2020 డిసెంబర్ 22 న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరు విడాకులు తీసుకోబోతున్నది నిజమేనని ఈ జంట సన్నిహిత వర్గాలు తెలియజేసినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కానీ చాహల్ – ధనశ్రీ జంట విడాకుల గురించి అధికారికంగా ప్రకటించలేదు. ఇలా వీరి విడాకుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో చాహల్ {Yuzvendra Chahal} మద్యం మత్తులో కెమెరా కంటికి చిక్కి మరోసారి వైరల్ గా మారాడు.
చాహల్ {Yuzvendra Chahal} కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పబ్ కి వెళ్ళిన చాహల్.. మద్యం మత్తులో తూగుతుండగా అతడిని పట్టుకొని మరొక వ్యక్తి బయటకు తీసుకువచ్చి కార్ లో కూర్చోబెట్టాడు. కారులో కూర్చున్న తర్వాత ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయకుండా చాహల్ తన ముఖానికి చేయి అడ్డుగా పెట్టుకున్నాడు. చాహల్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ప్రాణంగా ప్రేమిస్తే చివరికి ఇలాగే అవుతుందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Yuzvendra Chahal on drinking mode 💔
Tough time for chahal bhai.#YuzvendraChahal #dhanashreeverma pic.twitter.com/0J74fF2eOn
— Mohit (@Massmohitt) January 4, 2025