BigTV English

Strong Warning: యూట్యూబర్లకు పోలీసుల వార్నింగ్.. పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తే తాటా తీస్తామంటూ..

Strong Warning: యూట్యూబర్లకు పోలీసుల వార్నింగ్.. పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తే తాటా తీస్తామంటూ..

strong warning to social media influencers: సోషల్ మీడియాలో పలువురి విపరీత ధోరణితో సమాజంలో ఇతరులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. తాజాగా ఓ యూట్యూబర్ వైరల్ కావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వైరల్ కావడం కోసం డబ్బులను విచ్చలవిడిగా విసురుతూ.. దాన్ని రీల్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ కావడం ముచ్చట పక్కనపెడితే.. డబ్బులు చల్లిన వ్యక్తి వైరలయ్యాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అటువంటి పిచ్చి వీడియోలు చేస్తూ పబ్లిసిటీ కోసం పాకులాడే వారికి పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


Also Read: పొలంలో మొసలి ప్రత్యక్షం, ఖంగుతిన్న కూలీలు

వైరల్ కావడం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దంటూ సోషల్ మీడియా ఇన్ ఫ్లాయెన్సర్లకు సూచించారు. నెట్టింటా రీల్స్ కోసం సమాజానికి ఇబ్బంది కలిగే విధంగా దుశ్చర్యలు, పిచ్చి చేష్టలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు.


సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లలో కొందరు విపరీత పైత్యం ప్రదర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతినా రీల్స్ చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఓ యూట్యూబర్ కూడా ఇదేవిధంగా పైత్యాన్ని ప్రదర్శించడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం పోలీసుల వరకు చేరడంతో అతనిపై కేసు నమోదు చేశారని సమాచారం. ఈ క్రమంలో సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.

Also Read: షాకింగ్.. తెలంగాణలో 40 వేల మంది డ్రగ్స్ బాధితులు.. ఎక్కువగా..

ఇటు ప్రజలు కూడా మాట్లాడుతూ.. ఇలాంటి వ్యక్తులకు కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల వింత చేష్టలు కొంతవరకు తగ్గుతాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×