BigTV English

Director Surya Prakash Died: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి

Director Surya Prakash Died: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు మృతి

Director Surya Prakash Passed Away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ డైరెక్టరో సూర్యప్రకాష్ మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తమిళ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. సూర్యప్రకాష్ .. 1996లో మాణికం అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.


రాజ్‌కిరణ్ మరియు వనిత విజయ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన మాణికం ఆయనకు మంచిపేరునే తీసుకొచ్చి పెట్టింది. ఆ తరువాత ప్రభు హీరోగా పెన్ ఒండ్రు కండేన్‌ అనే సినిమాను మొదలుపెట్టాడు.. అది విడుదల కాలేదు. 2000 సంవత్సరంలో శరత్ కుమార్, మీనా జంటగా మాయి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఇదే సినిమాను తెలుగులో రాజశేఖర్, సాక్షి శివానంద్ జంటగా సింహరాశి పేరుతో రీమేక్ చేశారు. కన్నడలో నరసింహగా రీమేక్ చేయబడింది. తెలుగులో రాజశేఖర్ నటించిన భరతసింహారెడ్డి సినిమాకు దర్శకత్వం వహించింది కూడా సూర్యప్రకాష్ నే. ఈ సినిమా తరువాత తమిళ్ లో దివాన్ చిత్రంతో మరో మంచి విజయాన్ని అందుకున్నాడు. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇలా గుండెపోటుతో మరణించడంపై చిత్ర పరిశ్రమ ఆవేదన వ్యక్తం చేస్తుంది. సూర్యప్రకాష్ మృతిపై హీరో శరత్ కుమార్ ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ చేశాడు.


Also Read: Namita Divorce: భర్తతో నమిత విడాకులు.. ఇదిగో క్లారిటీ.. ?

“నా కెరీర్ లో మాయి, దివాన్ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నా ప్రియ మిత్రుడు సూర్యప్రకాష్ ఈరోజు తెల్లవారుజామున భగవాన్‌ దగ్గరకు చేరారనే వార్త ఎంతో దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. నిన్న కూడా అతనితో మాట్లాడాను. అస్థిర జీవితంలో అతని ఆకస్మిక మరణం నన్ను బరువెక్కించింది. ఆయన మృతితో బాధలో ఉన్న ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×