Mad Square Collections : యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్.. బ్యూటీఫుల్ లవ్, కామెడీ, యూత్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టిస్తుందన్న విషయంలో సందేహం లేదు.. ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి పెర్ఫామెన్స్ ను చూపిస్తోంది.. వరుసగా మూడు రోజులు దున్నేసిన ఈ సినిమా నాలుగో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్..
2023 లో వచ్చిన మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ రిలీజ్ అయింది. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మొదటి రోజు నుంచి కలెక్షన్స్ కురిపిస్తుంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.17 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యింది. ఇండియాలో రూ.8.5 కోట్ల నెట్ వసూల్ చేసింది.. అలాగే రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద రూ.28.50 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక మూడో రోజు వరకు వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ అందుకుందని ప్రకటించారు. అలాగే వారం రంజాన్ సందర్భంగా ఈ మూవీకి బాగానే కలిసి వచ్చిందని తెలుస్తుంది. 10 కోట్లు వరకు వసూల్ చేసిందని తెలుస్తుంది. దీని పై అధికార ప్రకటన రావాల్సి ఉంటుంది.
Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి..
ఈ సినిమాకు మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి.. దాంతో సినిమాకు బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగిందని తెలుస్తుంది. టార్గెట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లో వర్షం కురిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 450, వరల్డ్ వైడ్ గా 650 థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ దర్శకుడు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.
స్యూరదేవర నాగవంశీ సమర్పకులు. హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించారు.. ఇదే జోరులో కలెక్షన్స్ రాబడితే త్వరలోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం కూడా ఉందని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన మ్యాడ్ మూవీ కంటే ఎక్కువ వసూళ్లు రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సీక్వల్గా మరో మూవీని అవకాశాలు కూడా లేకపోలేదు.