BigTV English

MAD Square: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనుకున్న డేట్ కంటే ముందుగానే విడుదల..!

MAD Square: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనుకున్న డేట్ కంటే ముందుగానే విడుదల..!

MAD Square..సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బ్లాక్ బాస్టర్ చిత్రం మ్యాడ్ (MAD). ఈ మూవీకి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ (MAD Square) రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా నుండి ఇటీవల కాలంలో విడుదలైన టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. దాంతో మ్యాడ్ స్క్వేర్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయం అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా అనుకున్న రోజు కంటే ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.


ఒకరోజు ముందుగానే థియేటర్లలోకి..

అసలు విషయంలోకి వెళ్తే.. మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చి 29వ తేదీన శనివారం రోజు విడుదల కావాల్సి ఉండగా.. డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు ఒకరోజు ముందుగానే అంటే మార్చి 28 శుక్రవారం రోజున ఈ సినిమా విడుదల చేయాలని నిర్మాతలు కూడా నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఒకరోజు ముందుగానే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి ఈ సినిమా సిద్ధం అయిపోయింది. ఇక తాజా నిర్ణయంతో మ్యాడ్ స్క్వేర్ చిత్రం మొదటి వారంతంలోనే భారీ వసూలు రాబడుతుందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు.


విడుదల తేదీ మార్చడం పై నిర్మాత కామెంట్స్..

ఇకపోతే ఈ సినిమాని ఒక రోజు ముందుగానే విడుదల చేస్తుండడం పై నిర్మాత సూర్యదేవర నాగ వంశీ (Suryadevara Nagavamsi) కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ..” మా డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకే.. ఈ చిత్రాన్ని ఒకరోజు ముందుగానే విడుదల చేస్తున్నాము. చివరి నిమిషంలో విడుదల తేదీ మార్చాలనే ఉద్దేశం మాకు ఎప్పుడూ లేదు. పైగా మార్చి 29 అమావాస్య కావడంతో మా డిస్ట్రిబ్యూటర్లు విడుదలను ముందుకు తీసుకెళ్లడం ఉత్తమం అని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం పట్ల మేము కూడా సంతోషంగా ఉన్నాము. ఇకపోతే మార్చి 28న మ్యాడ్ స్క్వేర్ సినిమాతో పాటు ‘రాబిన్ హుడ్’ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఈ వేసవికి నవ్వుల పండుగ రాబోతోంది” అంటూ నిర్మాత నాగ వంశీ కూడా తెలిపారు.

మ్యాడ్ స్క్వేర్ సినిమా విశేషాలు..

ఇకపోతే మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన సంగీత్ శోభన్ , రామ్ నితిన్, విష్ణు ఓ ఐ , నార్నే నితిన్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ లో అంతకుమించి అల్లరి చేయబోతున్నారు. రెబా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్య దేవర నాగవంశీ , హారిక సూర్యదేవర , సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ్యాడ్ కంటే మ్యాడ్ స్క్వేర్ రెట్టింపు కలెక్షన్స్ వసూలు చేయాలని మేకర్స్ కూడా భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×