Anchor Roshan..ప్రముఖ యాంకర్ రోషన్ (Roshan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సీనియర్ నటీనటులను, కనుమరుగైన నటీనటులను తెర ముందుకు తీసుకొస్తూ.. వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తూ.. మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటారు.. అలా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రోషన్.. ఆయనే తనకు దైవం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి రోషన్ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం.
69 ఏళ్ల వయసులో కూడా..
ఆయన ఎవరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).టాలీవుడ్ సూపర్ సీనియర్ హీరోలలో ఒకరైన ఈయన.. గత నాలుగు దశాబ్దాలుగా తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. 69 ఏళ్ల వయసులో కూడా రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న చిరంజీవి.. యంగ్ డైరెక్టర్ లకి కూడా అవకాశాలు ఇస్తూ.. మరింత బిజీగా మారిపోయారు. ముఖ్యంగా సినిమాలతోనే కాదు సేవాగుణంలో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు చిరంజీవి. కష్టాల్లో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేస్తూ ఆదుకునే ఈయన.. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక అలాంటి ఈయన గురించి ఇప్పుడు యాంకర్ రోషన్ కూడా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు
వారి కోసం చిరంజీవి రూ.2కోట్ల చెక్కులు ఇచ్చారు – రోషన్..
ఎప్పుడూ ఒకరిని ఇంటర్వ్యూ చేసే రోషన్ తాజాగా ఒక టీవీ ప్రోగ్రాం (ఫ్యామిలీ స్టార్) కి హాజరై.. చిరంజీవి గురించి పలు విషయాలు వెల్లడించారు.. రోషన్ మాట్లాడుతూ..” నిజజీవితంలో తల్లిదండ్రులే నాకు హీరో , హీరోయిన్లు. ప్రొఫెషనల్ గా నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మాత్రం నా రియల్ హీరో చిరంజీవి. మీడియాలో ఒక సినిమాకి ఇలా కూడా ప్రమోషన్స్ చేయొచ్చా అని నన్ను ఇంటికి పిలిచారు. అది కాస్త వైరల్ అవ్వడంతో నేను బాగా పాపులర్ అయ్యాను. నా దృష్టిలో ఆయనే దేవుడు అని చెబుతాను. రోషన్ వస్తే ఒక గంట అయినా స్పెండ్ చేద్దాం.. వాడు అన్ని స్టేట్స్ తిరుగుతూ.. మంచి న్యూస్ చెబుతాడు అని, నా బర్తడే కి అదే ఇంట్లో కేక్ కట్ చేశారు. ఎంతోమందికి హెల్ప్ చేయాలని నేను చిరంజీవికి ఫోన్ చేస్తే.. ఆయన నాకు దాదాపు 2 కోట్ల రూపాయల చెక్కులు ఇచ్చారు” అంటూ రోషన్ తెలిపారు.
10 జన్మలెత్తినా ఆయనేనా అన్నయ్య కావాలి – రోషన్..
అంతేకాదు ఆయన ఎప్పుడూ నా గురించి గొప్పగా చెబుతూ ఉంటారు.. మీడియాలో ప్రశ్నించడం, కాంట్రవర్సీ చేయడం కాదు.. ఒకరికి హెల్ప్ చేయాలంటే రోషన్ తర్వాతే అని, సెట్లో ప్రతి ఒక్కరికి కూడా ఆయన నా గురించి చెబుతూ ఉంటారు. ఆయనది ఎంతో గొప్ప మనసు. నువ్వు వెళ్ళు.. నీ వెనుక నేనుంటాను.. అనే ధైర్యాన్ని ఆయన నాకు ఇచ్చారు. అందుకే ఆయన నా రియల్ హీరో.. అన్నయ్యకు జీవితాంతం కాదు పది జన్మలెత్తినా తమ్ముడుగా పుట్టాలని కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ ” అంటూ రోషన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇక చాలా తక్కువగా ఎమోషనల్ అయ్యే రోషన్ చిరంజీవికి పాదాభివందనం చేసి కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా రోషన్ చిరంజీవి గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారడం గమనార్హం