BigTV English

Madhav:- టాలీవుడ్‌లోకి ర‌వితేజ ఫ్యామిలీ హీరో

Madhav:- టాలీవుడ్‌లోకి ర‌వితేజ ఫ్యామిలీ హీరో

Madhav:- టాలీవుడ్‌లోకి వార‌సుల ఎంట్రీ కొత్తేమీ కాదు. తాజాగా ఈ లిస్టులో ర‌వితేజ ఫ్యామిలీ నుంచి ఓ హీరో వ‌చ్చి చేరారు. ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు.. మాధ‌వ్‌. ర‌వితేజ త‌మ్ముడు ర‌ఘు సోద‌రుడే ఈ మాధ‌వ్‌. ఈయ‌న కుర్ర హీరోతో రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి సినిమా చేస్తోంది. వివ‌రాల్లోకి వెళితే… జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఈ చిత్రం రూపొందబోతోంది. పెళ్లి సందD చిత్రంతో కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది.


తాజాగా ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, నిర్మాత డి సురేష్ బాబు, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారు, దర్శక నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, నటుడు రఘు తదితరుల ఆశిస్సులతో పూజా కార్యక్రమాలు జరుపుకుని ప్రారంభమైంది. దర్శకులు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ ను అందజేయగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

హీరో మాధవ్ మాట్లాడుతూ.. ‘జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ చిత్రం విడుదలయ్యేంత వరకూ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఇక్కడి వచ్చిన అందరికీ థ్యాంక్యూ సో మచ్’ అన్నారు.


దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ ‘నా తల్లి దండ్రులకు, మా గురువు గారు కే రాఘవేంద్రరావు గారికి థ్యాంక్యూ సో మచ్. ఓ రకంగా ఇది నా సెకండ్ డెబ్యూ మూవీగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా మమ్మల్ని దీవించడానికి వచ్చిన మా గురువుగారు, సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను.. మా హీరో మాధవ్ ను నమ్మినందుకు నిర్మాత రవిచంద్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. వారు చెప్పినట్టుగా ఇది చాలా యూత్ ఫుల్ గా సాగే కలర్ ఫుల్ గా ఉండే సినిమా. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు ఈ కథ విని చాలా ఇంప్రెస్ అయ్యారు. ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ తో సపోర్ట్ గా నిలుస్తున్నారు అనుకుంటున్నాను. ఇక నా గత చిత్రం లాగానే మీడియా సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×