BigTV English

Maharaja Movie: ‘మహారాజ’ సినిమాను వదులుకున్న ప్రముఖ హీరో.. ఎవరంటే?

Maharaja Movie: ‘మహారాజ’ సినిమాను వదులుకున్న ప్రముఖ హీరో.. ఎవరంటే?

Maharaja Movie Hero Vijay Sethupathi: విలక్షణ నటుడు విజయ్ సేతుపతి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’. ఈ సినిమాను ప్యాషన్ స్టూడియోస్, దిరూట్ బ్యానర్స్ పతాకాలపై సుధన్ సుందరం, జగదీశ్ పళని స్వామి నిర్మించారు.


అది అలా ఉంటే విజయ్ సేతుపతి హీరోగా తన కెరీర్‌లోని 50వ సినిమాకు నితిలిన్ సామినాధన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాను ముందుగా డైరెక్టర్ విజయ్ సేతుపతి కోసం రాసుకోలేదట. ఇలాంటి సినిమాలకు విజయ్ ఆంటోనీ అయితేనే సరిగ్గా సూట్ అవుతాడని, ఆయన కోసమే స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట.అయితే పలు కారణాలతో ఈ కథ విజయ్ సేతుపతి వద్దకు వచ్చింది.

మహారాజ కథను తొలుత డైరెక్టర్ విజయ్ ఆంటోనీకి వినిపించారని, ఈ కథ కూడా ఆంటోనికి నచ్చింది. అయితే ప్యాషన్ స్టూడియోస్ లో ఓ సినిమా చేయడానికి నితిలిన్ కు కమిట్ మెంట్ ఉంది. కానీ ఆంటోనీతో మహారాజ సినిమాను మరో నిర్మాత నిర్మించాలనుకున్నాడు. అయితే ప్యాషన్ స్టూడియో వారి దగ్గర సేతుపతి కాల్షీట్స్ ఉండడంతో మహారాజ సినిమాను సేతుపతి చేశారట. ఇలా విజయ్ ఆంటోనీ మిస్ చేసుకోవడంతో సేతుపతి మరో భారీ విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.


నటన అద్భుతం
మహారాజ సినిమాలో విజయ్ సేతుపతి నటన అద్భుతంగా ఉంది. పరిశ్రమలో ఓ హీరోతో మొదలై మరో హీరోతో తెరకెక్కించడం సాధరణమే. ప్రస్తుతం ఈ మహారాజ సినిమా హిట్ కావడంతో మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఇందులో బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్, చైల్డ్ ఆర్టీస్టు నమిదాస్, నటరాజ్, బాయ్స్ మణికందన్, సింగంపులి కల్కి, మమతా మోహన్ దాస్, అభిరామి కీలక పాత్రల్లో నటించారు.

కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా.. మహారాజ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తోంది. ఈ సినిమాను ఎన్వీఆర్ సినిమాస్ తెలుగులో విడుదల చేశారు.

Tags

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×