BigTV English

Pakistan: నిజం అంగీకరించిన పాక్ పీఎం షెహబాజ్.. ‘బ్రహ్మోస్‌’తో మా ప్లాన్ ఫెయిల్

Pakistan: నిజం అంగీకరించిన పాక్ పీఎం షెహబాజ్.. ‘బ్రహ్మోస్‌’తో మా ప్లాన్ ఫెయిల్

Pakistan: భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో తాము విజయం సాధించామంటూ తెగ గొప్పలు చెప్పింది దాయాది దేశం పాకిస్తాన్. తీరా చూసేసరికి అసలు విషయం బోధపడింది. తాము నష్టపోయామనే విషయాన్ని ఆలస్యంగా బహిరంగంగా అంగీకరించారు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇంతకీ ఏ విషయంలో, ఎక్కడ ఏం చెప్పారు?


పహల్‌గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం చేపట్టింది. దాదాపు నాలుగు రోజులపాటు ఇరుదేశాల మధ్య వార్‌లో దాయాది దేశం బాగానే నష్టపోయింది. ఈ విషయాన్ని భారత్ బలంగా చెప్పింది. కానీ తాము గెలిచామంటూ ఊదరగొట్టేలా ప్రచారం చేశారు ఆదేశానికి చెందిన ప్రభుత్వ నేతలు. వారికి అసలు విషయం బోధపడింది.

అజర్ బైజాన్‌ వెళ్లిన పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ అక్కడ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 10 ఉదయం ప్రార్థనలకు ముందే పాకిస్తాన్ బలగాలు భారత్‌పై దాడి చేయాలని ప్లాన్ చేశాయి. అది జరగకముందు భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై దాడి చేసిందని అంగీకరించారు.


తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు తగిన గుణపాఠం చెప్పేందుకు మాబలగాలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఆ సమయం రాకముందే భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో విరుచుకుపడిందన్నారు.  రావల్పిండిలోని ఎయిర్‌బేస్ సహా వివిధ ప్రావిన్సులోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని లాంగ్ రేంజ్ సూపర్‌ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిందన్నారు.

ALSO READ: అందమైన స్విస్ గ్రామం భూస్థాపితం.. గ్రామంపై విరుచుకుపడిన మంచు కొండలు

తెల్లవారుజామున జరిగిన దాడి గురించి ఆర్మీ చీఫ్ మునీర్ తనకు తెలిపారని వెల్లడించారు పాక్ ప్రధాని. భారత్ సైనిక ప్రతిస్పందనను ఆదేశ ప్రధాని అరుదైనదిగా అంగీకరించడం అసిమ్ మునీర్ సమక్షంలో జరిగింది. నిజానికి పశ్చిమ సరిహద్దు వెంబడి పౌర ప్రాంతాలపై పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణి దాడులను ప్రారంభించింది.

దానికి ప్రతిస్పందనగా భారత్ లక్ష్యంగా చేసుకున్న 11 సైనిక స్థావరాలలో రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం ఉంది. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఎయిర్‌బేస్‌లో లాక్‌హీడ్ C-130 హెర్క్యులస్, ఇల్యుషిన్ Il-78 ఇంధనం నింపే విమానాలు వంటి అత్యాధునిక సైనిక విమానాలున్నాయి.

ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ద్వారా రెండు సైనిక రవాణా వాహనాలకు నష్టం వాటిల్లినట్లు సూచింది. నూర్‌ఖాన్‌తోపాటు, రఫీకి, మురిద్, రహీమ్ యార్ ఖాన్, సుక్కుర్, చునియన్‌లలోని పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. వాటిలో స్కర్డు, భోలారి, జాకోబాబాద్, సర్గోధాలోని ఎయిర్ బేస్‌లు అపార నష్టాన్ని చవిచూశాయి.

దీనివెనుక ఏప్రిల్ 22న పహల్‌గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆదేశంలోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత్ సైన్యం. మే 7న పాక్ భూభాగాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసింది. దాడులు చేసింది ఫలితంగా 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది.

పాకిస్తాన్, పీఓకేల్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత నాలుగు రోజులుగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి గమనించి దాయాది దేశం అమెరికాను ఆశ్రయించడం జరిగింది. చివరకు కాల్పుల విమరణకు భారత్‌కు రాయబారం పంపిన విషయం తెల్సిందే.

 

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×