Mahesh Babu:ఘట్టమనేని కృష్ణ (Ghattamaneni Krishna )వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu). మొదట ‘రాజకుమారుడు’ సినిమాతో ప్రిన్స్ హీరోగా మారి, ఆ తర్వాత తన అద్భుతమైన నటన కనబరుస్తూ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. సాధారణంగా మహేష్ బాబు తన ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. కాస్త సినిమాల నుంచి బ్రేక్ దొరికితే చాలు భార్యాబిడ్డలతో విదేశాలకు వెళ్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మహేష్ బాబు ఎక్కువగా భార్య, కొడుకు, కూతురుతోనే కలిపి కనిపిస్తారు. కానీ తన అక్కలతో కలిసి కనిపించిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. అయితే ఒక్కొక్కసారి మహేష్ బాబు అలా తమ తోబుట్టువులతో కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన తోబుట్టులతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
అక్క మంజుల బర్త్ డే వేడుకల్లో మహేష్ బాబు..
తాజాగా మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మహేష్ బాబు తన భార్య నమ్రతతో పాటు సితార కూడా హాజరయ్యి సందడి చేసింది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ మెంబర్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో మంజుల (Manjula) షేర్ చేసి.. “మా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా, ప్రేమతో నా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాను. వీరంతా కలిసి నా పుట్టిన రోజును మరింత స్పెషల్ గా మార్చేశారు” అంటూ మంజుల పోస్ట్ చేసింది. ఇక ఈ ఫోటోలలో మహేష్ బాబు, నమ్రత, సితార, సుధీర్ బాబు, మహేష్ అన్నయ్య రమేష్ బాబు కొడుకు.. ఇలా మహేష్ బాబు ఫ్యామిలీ అంతా ఓకే ఫ్రేమ్ లో కనిపించేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆకట్టుకుంటున్న మహేష్ బాబు లుక్..
ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి(Rajamouli )దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా లొకేషన్స్ వేటలో ఉన్నారు. లొకేషన్స్ ఫైనల్ అవ్వగానే సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇకపోతే మరోవైపు మహేష్ బాబు జుట్టు, గడ్డం, బాడీ పెంచుతూ సిద్ధం అయిపోతున్నారు. తాజాగా మహేష్ బాబు తన అక్క మంజుల ఘట్టమనేని బర్త్డే సెలబ్రేషన్స్ కి హాజరవడంతో తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఘట్టమనేని మంజుల..
ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో కలలు కంది మంజుల. కానీ కృష్ణ అభిమానులు ఈమెను హీరోయిన్ గా ఇండస్ట్రీకి తీసుకురావడానికి ఇష్టపడలేదు. దానితో కృష్ణ కూడా తన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకున్నారు. ముఖ్యంగా తమ అభిమాన హీరో కూతురు ఇతర హీరోలతో కలిసి నటించడం ఇష్టం లేదని అభిమానులు తేల్చి చెప్పేశారు. ఇకపోతే కొన్ని చిత్రాలలో సహాయనటిగా నటించిన ఈమె.. హిందీ, తెలుగు, మలయాళం చిత్రాలలో నటించింది. అంతేకాదు మలయాళం లో ‘సమ్మర్ ఇన్ బెత్లెహెమ్’ అనే మలయాళ చిత్రంలో నటించి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది. అంతేకాదు తన తల్లి పేరు మీద ఇందిరా ప్రొడక్షన్స్ అనే ఫిలిం ప్రొడక్షన్ కంపెనీని కూడా కలిగి ఉంది మంజుల.