ICC T20I Rankings: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరో అరుదైన ఘనత సాధించాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు హార్థిక్ పాండ్యా. ఐసీసీ టి20 ర్యాంకింగ్స్.. లో హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. ఆల్ రౌండర్ లిస్టులో నెంబర్ వన్ గా నిలిచాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. దాదాపు 244 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు హార్దిక్ పాండ్యా.
Also Read: Virat Kohli: కోహ్లీ సంచలన పోస్ట్.. అనుష్కకు విడాకులు అంటూ అభిమానుల ఆందోళన ?
Also Read: Bhuvneshwar Kumar: ఐపీఎల్ వేలంకు ముందే LSG నుంచి భువనేశ్వర్ కు ఆఫర్ !
ఇక ఈ ఆల్ రౌండర్ లిస్టులో… హార్దిక్ పాండ్యా తో పాటు మరో నలుగురు ప్లేయర్లు టాప్ ఫైవ్ లో ఉన్నారు. ఇందులో రెండవ స్థానంలో దీపేంద్ర ఉండగా…మూడవ స్థానంలో లివింగ్ స్టోన్ ఉన్నాడు. ఆ తర్వాత స్టొయినోస్…హసరంగా ఉన్నాడు. ఇక అటు టి20 బౌలింగ్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో రవి బిస్నోయి, అర్షదీప్ టాప్ 10 లో ఉన్నారు. అగ్రస్థానంలో అదిల్ రషీద్ ఉన్నాడు. అదే సమయంలో మన హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ కూడా… ఐసీసీ ప్రకటించిన టి20 బ్యాటింగ్ విభాగంలో.. అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
Also Read: Maharashtra elections 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సచిన్ ఫ్యామిలీ..వీడియో వైరల్
ఏకంగా 60 స్థానాలు వేగబాకి టాప్ 10 లోకి వచ్చేసాడు టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ. దక్షిణాఫ్రికా టూర్ లో… రెండు సెంచరీలతో కలిపి మొత్తం 280 పరుగులు చేశాడు తిలక్ వర్మ.దీంతో మెరుగైన స్థానాలను దక్కించుకోగలిగాడు. తాజా ర్యాంకింగ్స్‌లో తిలక్ వర్మ 69 స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో టీమిండియా యంగ్ ప్లేయర్ సంజు కూడా.. ఈసారి ర్యాంకింగ్స్ లో పర్వాలేదనిపించాడు. 22వ స్థానానికి ఎగబాకి.. శభాష్ అనిపించాడు సంజు. ఇక టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read: Champions Trophy 2025: పాకిస్తాన్ కు ఐసీసీ వార్నింగ్..నోరు మూసుకొని.. మేం చెప్పినట్టు వినండి?
ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన సంజూ శాంసన్ తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 17 స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకున్నాడు. శాంసన్ తన చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు సాధించాడు. ఎన్నడూ లేని విధంగా t20 ఫార్మాట్‌లో సంచలన ఫామ్‌లో ఉన్నాడు సంజూ శాంసన్. ఈ తరుణంలోనే కెప్టెన్ సూర్యకుమార్ మరియు కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతును సంజూ శాంసన్ ఆనందిస్తున్నట్లు తెలుస్తోంది.
టాప్ 30లో భారత బ్యాటర్లు – ICC T20I ర్యాంకింగ్స్
3. తిలక్ వర్మ – 806 రేటింగ్ పాయింట్లు
4. సూర్యకుమార్ యాదవ్ – 788 పాయింట్లు
8. యశస్వి జైస్వాల్ – 706 పాయింట్లు
15. రుతురాజ్ గైక్వాడ్ – 619 పాయింట్లు
22. సంజు శాంసన్ – 598 పాయింట్లు