BigTV English

Mahesh Babu Family: కాలినడకన తిరుమలకు మహేశ్‌బాబు ఫ్యామిలీ

Mahesh Babu Family: కాలినడకన తిరుమలకు మహేశ్‌బాబు ఫ్యామిలీ

Super Star Mahesh Babu Family Visit Tirumala: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార బుధవారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడక ప్రారంభించారు. ఈ మేరకు రాత్రి 7.30 నిమిషాలకు తిరుమలకు చేరుకున్నారు. నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టడంతోపాటు కర్పూరం వెలిగించారు. అనంతరం నడకమార్గంలో స్వామివారి దర్శనానికి బయలుదేరారు. చివరి మొట్టు వద్ద కూడా కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు.


అంతకుముందు మహేశ్ బాబు ఫ్యామిలీ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు వారి వెంట కాలినడకన నడిచారు. నడక మార్గంలో భక్తులను పలకరిస్తూ కొండకు చేరుకున్నారు. కొంతమంది అభిమానులు మహేశ్ బాబు ఫ్యామిలీతో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. అనంతరం రాత్రి అక్కడే తిరుమలలోని సుధాకృష్ణ నిలయం అతిథి గృహంలో బస చేశారు. ఈ మేరకు మహేశ్ బాబు కుటుంబ సభ్యులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మహేశ్ కుటుంబ సభ్యులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం తర్వాత పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Also Read: కోటాను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా ఏంటో తెలుసా..?


ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్, సతీమణి లావణ్య కూడా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శ సమయంలో దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీకపూర్ కూడా దర్శించుకున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×