BigTV English

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు నిరాశ, తోసిపుచ్చిన కోర్టు

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు నిరాశ, తోసిపుచ్చిన కోర్టు

Vinesh Phogat: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు కాలం కలిసి రాలేదు. తనకు న్యాయం జరుగుతుందని భావించిన ఆమెకు నిరాశ ఎదురైంది. కనీసం తనకు రజత పతకం ఇవ్వాలన్న పిటిషన్‌ను కోర్టాఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్- కాస్ కొట్టేసింది. న్యాయస్థానం తీర్పును భారత ఒలింపిక్స్ సంఘం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది.


పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరింది భారత్‌కు చెందిన వినేశ్ ఫొగాట్. కాకపోతే ఆమె బరువు కేవలం 100 గ్రాములు ఉండడంతో ఆమెపై అనర్హత వేటు వేసింది పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు. ఆ బాధతో వినేశ్, రెజ్లింగ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేసింది. అయినా చిన్న ఆశ మాత్రం ఉండేది.

పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టాఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అప్పీల్ చేసింది వినేశ్ ఫొగాట్. కనీసం తనకు రజత పతకం ఇవ్వాలని అందులో పేర్కొంది. దీనిపై ఈనెల 13న నిర్ణయం వస్తుందని అందరూ భావించారు. దీంతో వినేశ్‌కు పతకం ఖాయమని భావించారు క్రీడాభిమానులు.


ALSO READ: కాసేపు నవ్వుతూ.. పెళ్లిపై మనుబాకర్ క్లారిటీ, అనుకోకుండా జరిగిపోయింది

చివరు న్యాయస్థానం వన్ లైన్‌తో తీర్పు వెల్లడించింది. దీంతో వినేశ్ ఫొగాట్ షాకయ్యింది. కాస్ నిర్ణయంపై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటీ ఉష రియాక్ట్ అయ్యారు. న్యాయస్థానం వినేశ్ పిటీషన్ కొట్టివేయడం తమకు నిరాశ కలిగిందని తెలిపారు.

కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వినేశ్‌పై ప్రభావం చూపింద ని తెలిపారు. ఆటగాళ్ల మానసిక ఒత్తిడిని పరిగణనలోకి తీసుకోవడంలో కాస్ విఫలమైందని పేర్కొన్నారు.  ఈ విషయంలో వినేశ్‌కు పూర్తి మద్దతు కొనసాగిస్తామని వెల్లడించారు. న్యాయపరంగా ఇంకేమైనా అవకాశా లు ఉన్నాయేమో పరిశీలిస్తామన్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×