Mahesh Babu : రాజమౌళితో సినిమా చేస్తే గ్లోబల్ రేంజ్‌లో ఫేమస్ అవ్వొచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. గతంలో ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్ చేసింది ఆయనే. మొన్నటికి మొన్న రామ్ చరణ్, తారక్ కూడా ఇంటర్నెషనల్ స్టేజ్‌పై నిలబడ్డారు అంటే… దానికి కారణం ఒన్ అండ్ ఓన్లీ జక్కన్న.
కొన్ని మెడిసిన్ వేసుకుంటే.. రిజల్ట్ బానే ఉంటుంది. కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అలాగే జక్కన్నతో సినిమా చేస్తే ఇలాంటి నేమ్ అండ్ ఫేంతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటో… బాహుబలి మూవీ చేసిన ప్రభాస్‌కు, ఆర్ఆర్ఆర్ మూవీ చేసిన రామ్ చరణ్, తారక్‌కు బాగా తెలుసు. ఇప్పుడు SSMB 29 మూవీతో మహేష్ బాబుకి కూడా అది తెలుస్తుందని అందరూ అనుకున్నారు.
ఏమాటకు ఆ మాట… జక్కన్న తో సినిమా అంటే… కండీషన్స్ ఎక్కువే ఉంటాయి.
ఆ కండీషన్స్ లో మెయిన్ పాయింట్… అంటే తనతో సినిమా చేసే కాలంలో ఆ హీరో ఇంకెవ్వరితో సినిమా చేయొద్దు. అలాగే… ఆ హీరో బయట ఎక్కడా కూడా కనిపించొద్దు. లుక్ బయటికి రివీల్ అయ్యే పనులేవీ కూడా హీరో చేయొద్దు. ఫారిన్ ట్రిప్స్ లాంటివి అయితే పూర్తిగా మర్చిపోవాలి.
ఇవన్నీ మహేష్ బాబుకు కూడా వర్తిస్తాయి. అందుకే సినిమా స్టార్టింగ్ డేస్‌లో… మహేష్ బాబు పాస్ పోర్ట్ ను లాగేసుకుని, సింహాన్ని ఓ బోనులో పెట్టినట్టు ఉన్న ఫోటో ముందు నిలబడి ఫోజ్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో జక్కన్న బోనులో మహేష్ ఇరుక్కున్నాడు అని చెప్పకనే చెప్పాడు. ఫారెన్ ట్రిప్స్ లాంటావి కూడా ఉండబోవని చెప్పేశాడు ఆ ఫోటోతో… ఆ ఫోస్ట తో…
అయితే… జక్కన్న కండీషన్స్ తూ చా తప్పకుండా పాటించేందుకు అక్కడ ఉన్నది ప్రభాసో… చరణో.. తారకో.. కాదు. అక్కడ ఉన్నది మహేష్ బాబు. జక్కన్న కండీషన్స్ అన్నింటినీ గట్టుపై పెట్టేసి ఇటీవల ఓ యాడ్ లో కనిపించాడు మహేష్. ఇది చూసిన అందరూ ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోయారు.
ఒక్కసారి జక్కన్న మూవీలోకి ఎంట్రీ ఇచ్చాడంటే… ఇలాంటివి అసలు జరగవు. కానీ, ఇప్పుడు చాలా చక్కగా… మూవీలో ఉండే లుక్‌తోనే తన కూతురు సితారాతో కలిసి యాడ్ చేశాడు. అది రిలీజ్ కూడా అయింది.
దీంతో జక్కన్న కండీషన్స్ మహేష్ దగ్గర పని చేయవు అని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు జక్కన్న బోనులో నుంచి బాగా జూలు పెంచిన సింహం బయటికొచ్చింది అంటూ నెట్టింట్లో రాసుకొస్తున్నారు.
అయితే.. దీనికి మరో కోణం కూడా ఉంది. మహేష్ గుంటూరు కారం తర్వాత మరే సినిమా చేయలేదు. SSMB 29 కోసం ఇప్పటికే ఒక సంవత్సరం కేటాయించాడు. ఆ సినిమా రావడానికి ఇంకెంత సమయం పడుతుందో తెలీదు. ఇప్పటికే 2025లో తమ హీరోను చూడలేకపోతున్నాం అనే బాధ ఫ్యాన్స్ కు ఉంది. ఇలా యాడ్స్ వల్ల అయినా… చూడొచ్చు అని వాళ్ల ఫీలింగ్.
దీంతో పాటు జక్కన్నపైన ఓ నెగిటివిటీ ఉంది. ఆయన సినిమాల్లో చేసే హీరోలకు ఓ రకమైన టార్చర్ ఉంటుందని. ఆ ముద్రను జక్కన్న తొలగించుకోవాలని అనుకుంటున్నాడేమో అని కూడా అనుకొవచ్చు. అందరి డైరెక్టర్లలానే… హీరోలకు కాస్త ఫ్రీడం ఇవ్వాలని చూస్తున్నాడా…? అందువల్లే మహేష్ యాడ్ బయటికొచ్చిందా..? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
అదే నిజమైతే… త్వరలోనే జక్కన్న చేతిలో ఉన్న పాస్ పోర్టు మళ్లీ మహేష్ బాబు చేతికి రావొచ్చు. ఆయన మళ్లీ ఫారెన్ ట్రిప్స్ కి వెళ్లొచ్చు.