Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2024 లో లక్నో సూపర్ జెంయింట్స్ కెప్టెన్ గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ని మెగా వేళానికి ముందు ఆ ఫ్రాంచైజీ వదులుకుంది. అనంతరం ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేఎల్ రాహుల్ ని ఢిల్లీ క్యాపిటల్స్ {Delhi Capitals} దక్కించుకుంది. ఢిల్లీ నుండి రిషబ్ పంత్ వెళ్లిపోవడంతో.. అతడి స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు రాహుల్ తీసుకుంటాడని అంతా భావించారు.
Also Read: Rohit Sharma: రోహిత్ ను ఘోరంగా అవమానించిన PSL… ఇంత దారుణమా?
కానీ కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్ తిరస్కరించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ కి అవకాశం వచ్చింది. ఇక ఈ సీజన్ లోని మొదటి రెండు మ్యాచ్ లకు దూరం కానున్నాడు రాహుల్. అతడి భార్య అథియా శెట్టి మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ కారణంగా అతడు మొదటి రెండు మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలిస్సా హీలి ఓ యూట్యూబ్ ఛానల్ వేదికగా తెలిపారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ లో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో వేచి చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ {Delhi Capitals} జట్టు యువ ఆటగాళ్లతో బలంగానే ఉంది. అయినప్పటికీ రాహుల్ టి-20 ల్లో చాలా కీలకపాత్ర పోషిస్తాడని, అతడి ఆట అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది అలిస్సా హీలి. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాహుల్ ని ఢిల్లీ క్యాపిటల్స్ 12 కోట్లకు కొనుగోలు చేసింది.
రాహుల్ తన అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ తో ఈ సీజన్ లో జట్టుకు మంచి సపోర్ట్ ఇవ్వాలని భావిస్తున్నాడు. కానీ ఇప్పుడు మొదటి రెండు మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలిసిన ఢిల్లీ క్యాపిటల్స్ {Delhi Capitals} అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో మార్చి 24న విశాఖపట్నంలో లక్నోతో తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం మార్చ్ 30 ఆదివారం రోజున హైదరాబాద్ జట్టుతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లకి రాహుల్ దూరం కానున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్, వైస్ కెప్టెన్ డూప్లెసిస్ లతో పటిష్టమైన జట్టును తయారు చేసేందుకు సిద్ధంగా ఉంది.
Also Read: Chahal Dhanashree Divorce: చాహల్-ధనశ్రీ విడాకులలో ట్విస్ట్.. అప్పుడే మంట మొదలైంది..?
ఇక రాహుల్ జట్టులో లేకపోవడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఆర్డర్ లో పలు రకాల మార్పులను చేయనున్నట్లు సమాచారం. రాహుల్ స్థానంలో ఎవరు ఆడతారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సీజన్ లో కెప్టెన్ గా బరిలోకి దిగకపోయినా.. జట్టుతో కలిసి ముందుకు నడుస్తానని తెలిపాడు రాహుల్. కెప్టెన్ గా తనకు ఉన్న అనుభవంతో జట్టు కష్టకాలంలో ముందు ఉంటానని తెలిపాడు. తన బ్యాటింగ్ తో జట్టుకు వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించి పెడతానని ఢిల్లీ జట్టులో ధైర్యాన్ని నింపాడు.