Big Stories

Hospital: దెబ్బ తగిలితే కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో అతికించేశారు.. ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం..

Hospital: ఏడేళ్ల ప్రవీణ్. పెళ్లిలో ఆడుకుంటూ కిందపడ్డాడు. కంటిపైన గాయమైంది. చర్మం లోతుగా తెగింది. పక్కనే ఉన్న ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లారు ఇంట్లో వాళ్లు. ఆ టైమ్‌కి డాక్టర్ అందుబాటులో లేడు. హాస్పిటల్ స్టాఫ్ పిల్లాడిని పరిశీలించి చికిత్స చేశారు.

- Advertisement -

చికిత్స అంటే ఏదో పద్దతి ప్రకారం చేయడం కాదు.. చర్మం తెగిన చోట కుట్లు వేయాల్సింది పోయి.. ఫెవిక్విక్‌తో అంటించారు. మరేం పర్వాలేదు పోండి.. అంటూ పంపించేశారు.

- Advertisement -

ఆ సిబ్బంది చేసిన ట్రీట్‌మెంట్ చూసి పిల్లాడి ఫాదర్‌కి మైండ్ పోయింది. అదేంటి? దెబ్బ తగిలితే కుట్లు వేయకుండా ఫెవిక్విక్ పెట్టి అతికించడమేంటి? అదేమైన పెన్ను, పేపర్, ప్లాస్టిక్ వస్తువా? మైండ్ ఉన్నోళ్లు ఎవరైనా అలా ఫెవిక్విక్‌తో అంటిస్తారా? ఇవే ప్రశ్నలు అడిగాడు ఆ తండ్రి. స్టాఫ్ బిత్తరపోయి నిలుచున్నారు. ఈ లోగా అసలు డాక్టర్ వచ్చాడు. అతన్ని పట్టుకుని నిలదీశాడు ఆ పేరెంట్.

బుద్దుందా? కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో చర్మం అతికిస్తారా? అని అడిగాడు. ఆ డాక్టర్ మరింత కూల్‌గా ఆన్సర్ చెప్పాడు. మా స్టాఫ్ పొరపాటు చేసి ఉండొచ్చని.. బాలుడికి ఏమీ కాదని భరోసా ఇచ్చాడు. ఏమైనా జరిగితే తాను బాధ్యతవహిస్తానంటూ ఆ తండ్రికి నచ్చజెప్పబోయాడు. కానీ, ఆ ఫాదర్ మామూలోడు కాదు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. ఆ హాస్పిటల్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో జరిగింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News