Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ ఇండస్ట్రీలో కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ అయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలకు ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగాడు. కేవలం సినిమాల పరంగానే కాదు మానవత్వం ఎక్కువే.. తన దగ్గరికి సాయం కోరిన వారికి సాయం అందిస్తూ ఉంటాడు. సినిమాల పరంగా ఎంత ఎదిగాడో.. సమాజ సేవ ద్వారా అంతే గుర్తింపు పొందాడు. ఇప్పటికే వేల మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్ చేయిస్తూ వారికి కొత్త లైఫ్ ను అందిస్తున్నాడు. అయితే తాజాగా మరో గొప్ప పని చేశాడు సూపర్ స్టార్. ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి అభిమానుల చేత ప్రశంసలు అందుకున్నాడు.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇద్దరు చిన్నారుల జీవితాల్లో వెలుగులు..
గుండె సంబంధిత చిన్నారులకు ఇద్దరికి గుండె సంబందించిన ఆపరేషన్ చేయించాడు. ఈ పిల్లలలో ఇద్దరు ఒకరు నాలుగేళ్ల పిల్లాడు, మరొకడు రెండేళ్ల చిన్నారి. మహేష్ బాబు చేయించిన ఆపరేషన్ గురించి ఆ తల్లిదండ్రులు చాలా గొప్పగా చెప్తున్నారు. తమ పిల్లలకి పునర్జన్మ ఇచ్చారని మహేష్ బాబు పై ప్రశంశలు కురిపిస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు మహేష్ బాబు ఆపరేషన్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ఫౌండేషన్ తరపున ఇప్పటికే 4500 మందికి ఆఫరేషన్స్ చేయించారు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే మహేశ్ తరఫున సేవా కార్యక్రమాలను నమ్రత నిర్వహిస్తోంది..
Also Read : వంటలక్కకు రెమ్యూనరేషన్ తో పాటు అవి కూడా కంపల్సరీ.. నిర్మాతలకు తడిసిపోవాల్సిందే..?
మహేష్ బాబు – రాజమౌళి సినిమా..
మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చిత్రం SSMB 29. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జక్కన్న. భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు ఏకంగా ప్రపంచ సినీ ప్రముఖులే ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు, పలు అవాంతరాలను దాటుకుని ఈ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది… ఈ మూవీ షూటింగ్ ని ఎంత వీలైతే అంత త్వరగా పూర్తిచేసి సినిమాను వచ్చేయడాది థియేటర్లలోకి తీసుకురావాలని రాజమౌళి ఆలోచిస్తున్నారు. నిజం చెప్పాలంటే రాజమౌళి సినిమాలు రెండు మూడేళ్లు తీసుకుంటాయన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా విషయంలో మాత్రం రాజమౌళి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వచ్చే ఏడాది థియేటర్లలోకి వస్తుందేమో చూడాలి.. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో మూవీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.