Laapataa Ladies: ఇండియన్ ఇండస్ట్రీ నుండి సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లడం చాలా పెద్ద విషయం. ఎన్నో వందల, వేల సినిమాల నుండి ఫిల్టర్ అయ్యే కొన్ని సినిమాలు మాత్రమే ఆస్కార్ వరకు షార్ట్ లిస్ట్ అవుతాయి. తాజాగా అలా ఫిల్టర్ అయ్యి దాదాపు ఆస్కార్ వల్ల షార్ట్ లిస్ట్ అయిన సినిమాల్లో ‘లాపతా లేడీస్’ కూడా ఒకటి. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్ రేసు వరకు వెళ్లడం మాత్రమే కాదు.. ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణ కూడా సంపాదించుకుంది. ఎప్పుడూ యాక్షన్ మూవీస్ వెంటపడే బాలీవుడ్ నుండి ఇలాంటి సినిమా వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోయారు. అలాంటిది ‘లాపతా లేడీస్’ ఫ్యాన్స్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురయ్యింది.
అరబిక్ సినిమాతో పోలికలు
కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ను అమీర్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించారు. అందరూ కొత్త నటీనటులతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అలాంటి ఈ సినిమా కాపీ అంటూ కొందరు నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు. 2019లో విడుదలయిన ‘బుర్ఖా సిటీ’ అనే అరబిక్ సినిమాకు సంబంధించిన సీన్ ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీన్‌కు.. ‘లాపతీ లేడీస్’ సినిమాకు చాలా పోలికలు ఉన్నాయని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. దీంతో కిరణ్ రావు తెరకెక్కించిన సినిమా ఒరిజినల్ కాదా అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి.
ఎన్నో రివార్డులు
2024 మార్చి 1న ‘లాపతా లేడీస్’ థియేటర్లలో విడుదలయ్యింది. థియేటర్లలో విడుదలయినప్పటి కంటే ఓటీటీలో రిలీజ్ అయ్యాకే ఈ సినిమాకు మరింత ఆదరణ లభించింది. అలా ప్రతీ భాషా ప్రేక్షకుడికి ఈ సినిమా చేరింది. థియేటర్లలో విడుదల అవ్వక ముందే 2023లో జరిగిన టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ఈ సినిమా ఫీచర్ అయ్యింది. ఆ తర్వాత మరెందరో సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమా నచ్చిందంటూ స్పెషల్‌గా ప్రమోట్ కూడా చేశారు. అలా అటు సెలబ్రిటీలను, ఇటు ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా కాపీ అంటే ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీన్ చూస్తుంటే సినిమా కాపీ అని నమ్మక తప్పడం లేదు.
Also Read: ఆ హీరోలా ఉండడం వీళ్లకు చేతకాదు.. బాలీవుడ్ హీరోలపై నిర్మాత ఫైర్
కాపీ అయితే ఎలా.?
‘లాపతా లేడీస్’ (Laapataa Ladies)లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన రవి కిషన్ సీన్, ‘బుర్ఖా సిటీ’ (Burqa City)లోని సీన్ దాదాపు ఒకేలా ఉన్నాయి. అందులో బుర్ఖా ఉంటే ఇందులో పరదా ఉంది. అంతే తేడా అనుకుంటున్నారు ప్రేక్షకులు. దీంతో ‘లాపతా లేడీస్’పై నెగిటివిటీ ఏర్పడింది. బాలీవుడ్ ఇలాంటి సినిమాలు కూడా చేయగలదు అని నిరూపించిన ‘లాపతా లేడీస్’ కాపీ అయితే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హిందీ సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. చాలావరకు యాక్షన్ చిత్రాలను మాత్రమే తెరకెక్కిస్తూ, వాటితోనే హిట్ కొట్టాలని మేకర్స్ అనుకుంటున్నారు. అవి వర్కవుట్ అవ్వడం లేదు. అలాంటిది ‘లాపతా లేడీస్’ మాత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించింది.
is #kiranrao S #lapaataladies copied from 1999 movie #burqacity pic.twitter.com/3wswrHjrmE
— Chandrakant (@shindeckant) March 31, 2025