SA20 league: సౌత్ ఆఫ్రికా టీ-20 లీగ్ {SA20 league} లో భాగంగా శనివారం రోజు ప్రిటోరియా క్యాపిటల్స్ – పార్ల్ రాయల్స్ జట్ల మధ్య 12వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పార్ల్ రాయల్స్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్, ఓపెనర్ రూబిన్ హెర్మాన్ మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో ఈ మ్యాచ్ లో ప్రిటోరియా క్యాపిటల్స్ పై 8 వికెట్ల తేడాతో పార్ల్ రాయల్స్ విజయం సాధించింది. ఈ {SA20 league} మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ప్రిటోరియాకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.
Also Read: Kho Kho World Cup final: ఖో ఖో వరల్డ్ కప్ ఫైనల్లోకి భారత ఇరుజట్లు.. నేపాల్ తో అమీతుమీ!
రెండు ఓవర్లకి 18 పరుగులు చేసిన ప్రిటోరియ.. రెండవ ఓవర్ మొదటి బంతికి విల్ జాక్స్ (9) వికెట్ ని కోల్పోయింది. అనంతరం గుర్బాజ్ (42), విల్ స్మీద్ (54) పరుగులతో మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. {SA20 league} ఇక తొమ్మిదో ఓవర్ 6 వ బంతి వద్ద గుర్బాజ్ వికెట్ ని కోల్పోయింది ప్రిటోరియా. అనంతరం వెర్రేయన్నే (45), నీషమ్ (28) పరుగులు చేశారు. దీంతో ప్రిటోరియా 20 ఓవర్లు ముగిసిన సరికి 212 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయింది.
పార్ల్ రాయల్స్ బౌలర్లలో మలింగ 1, గలీమ్ 2, ముజీబ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్ జట్టు {SA20 league} తొలి ఓవర్ తొలి బంతికే డ్రీ ప్రిటోరియస్ వికెట్ ని కోల్పోయింది. ఆ తర్వాత జో రూట్.. ప్రిటోరియా బౌలర్లకి చుక్కలు చూపించాడు. 60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. హెర్మాన్ 56, డేవిడ్ మిల్లర్ 48 పరుగులతో రాణించడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లను కోల్పోయి పార్ల్ రాయల్స్ లక్ష్యాన్ని ఛేదించింది.
{SA20 league} ప్రిటోరియా బౌలర్లలో విల్ జాక్స్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు. హోరా హోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే పార్ల్ రాయల్స్ విజయం సాధించిన సందర్భంలో ఓ చిన్నారి {baby} ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read: Sanju Samson- BCCI: సంజూ శాంసన్ కి బిగ్ షాక్.. సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు!
స్టాంట్స్ లో కూర్చున్న ఆ చిన్నారి.. తన ఫేవరెట్ టీమ్ ప్రిటోరియా పరాజయం చెందడంతో {baby} నిరాశతో రెండు చేతులతో తల పట్టుకుంది. దీంతో ఈ చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మ్యాచ్ ముగిసిన సందర్భంలో ఈ చిన్నారి ప్రత్యేక {SA20 league} ఆకర్షణగా నిలిచింది. దీంతో ప్రస్తుతం ప్రిటోరియా పరిస్థితి ఇదేనంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.
A BEAUTIFUL MOMENT IN SA20.😍
– The Baby’s Reaction.♥️#SA20 #SA20SuperFanpic.twitter.com/LXWfLmXi5W
— 𝐈 𝐒how 𝐂ricket 🏏🇮🇳 (@IShoCricket24X7) January 18, 2025