E-Paper
Advertisement

Mahesh Babu Rajamouli Movie Update : రాజ‌మౌళి – మ‌హేష్ సినిమాకు ఎన్ని సీక్వెల్స్ ఉన్నాయో తెలుసా?

Mahesh Babu Rajamouli Movie Update : రాజ‌మౌళి – మ‌హేష్ సినిమాకు ఎన్ని సీక్వెల్స్ ఉన్నాయో తెలుసా?
Advertisement

Mahesh Babu Rajamouli Movie Update : బిగ్ కాంబినేష‌న్స్ మీద వ‌స్తున్న సినిమాల మీద ఇంట్ర‌స్ట్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. రాజ‌మౌళి – మ‌హేష్ సినిమా మీద కూడా అందుకే ఆ రేంజ్ ఇంట్ర‌స్ట్ ఉంది జ‌నాల్లో. మ‌హేష్ బాబు హీరోగా రాజ‌మౌళి ఓ సినిమాను తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతుంది. ప్ర‌స్తుతం ఫ‌స్ట్ హాఫ్ స్క్రిప్ట్ ని లాక్ చేసే ప‌నిలో ఉన్నారు స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అండ్ డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి. ప్ర‌స్తుతం వెకేష‌న్‌లో ఉన్న మ‌హేష్ తిరిగి ఇండియాకు రాగానే 60 రోజుల్లో త్రివిక్ర‌మ్ సినిమా పూర్తి చేస్తారు.ఆ వెంట‌నే రాజ‌మౌళి సినిమా కోసం ఫిజిక‌ల్ ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్‌కి రెడీ అవుతారు. ఈ సినిమా జంగిల్ బేస్ట్ స్టోరీతో తెర‌కెక్కుతుంది. రియ‌ల్ లైఫ్ కేర‌క్ట‌ర్‌ని ఆధారంగా చేసుకుని క‌థ రాసుకుంటున్నారు. ఫ్రాంఛైజీగా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు రాజ‌మౌళి. క‌థా ప‌రంగా సీక్వెల్స్ లో కంటిన్యూ కాదు కానీ, కేర‌క్ట‌ర్స్ ప‌రంగా సీక్వెల్స్ ఉంటాయ‌ని అనౌన్స్ చేశారు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌.

రాజ‌మౌళికి ఇలాంటి అడ్వంచ‌ర‌స్ సినిమాను తెర‌కెక్కించాల‌న్న‌ది చాలా కాలం నాటి కోరిక‌. అది ఇప్ప‌టికి తీరుతుంద‌ని అన్నారు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌. రాజ‌మౌళితో సినిమా చేయ‌డం అంటే క‌ల నిజ‌మైన‌ట్టేన‌ని, 25 సినిమాల‌కు చేయాల్సినంత కృషి ఈ సినిమా కోసం చేయాల్సి ఉంటుంద‌ని గ‌తంలోనే చెప్పారు మ‌హేష్‌బాబు. బౌండ‌రీస్‌ని బ‌ద్ధ‌లు కొట్టి సిస‌లైన ప్యాన్ ఇండియ‌న్ సినిమా అంటే ఇది అని ప్ర‌పంచానికి చూపించేలా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు నిర్మాత కె.ఎల్‌.నారాయ‌ణ‌.
ఈ సినిమాకు సంబంధించి లైన్ రెడీగా ఉంది. ఫ‌స్ట్ హాఫ్ సీన్స్ ని త్వ‌ర‌లోనే మ‌హేష్‌కి నెరేట్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. మ‌రోవైపు కీర‌వాణి కూడా ఎక్క‌డెక్క‌డ ఎలాంటి మ్యూజిక్ ప‌డితేబావుంటుంద‌నే విష‌యం మీద ఫోక‌స్ పెంచార‌ట‌.

Advertisement

త్రివిక్ర‌మ్ సినిమా పూర్తి కాగానే, మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాకు సంబంధించి పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌నున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×