SSMB 29 Update:సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)హీరోగా దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli ) కాంబోలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘SSMB – 29’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా రీసెంట్ గా గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందులో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని రాజమౌళి కూడా ప్లాన్ చేస్తూ.. నటీనటులు ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అంతేకాదు ఈ సినిమాలోని లొకేషన్స్ కోసం విదేశాలలో జక్కన్న ఒక్కడే కష్టపడుతూ ఫైనల్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఎస్ఎస్ఎంపి 29లో వెంకటేష్..
ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra), మహేష్ బాబు( Mahesh Babu) సరసన హీరోయిన్ గా అవకాశం అందుకున్నట్లు, విలన్ క్యారెక్టర్ లో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithvi Raj Sukumaran) నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందని అభిమానులు కూడా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ అభిమానులలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాలో మహేష్ బాబుకు అన్నగా విక్టరీ వెంకటేష్ (Venkatesh)నటిస్తున్నట్లు సమాచారం.
సెంటిమెంట్ రిపీట్..
ఇకపోతే ఇదివరకే మహేష్ బాబు, వెంకటేష్ కాంబోలో అప్పట్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా వచ్చి క్లాసిక్ మూవీ గా, సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్ కి అప్పట్లో మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతుండగా.. ఈసారి కూడా వీరి కాంబినేషన్ రిపీట్ అయితే సెంటిమెంట్ బాగా కలిసి వస్తుందని , కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంటుందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చేవరకు నిజానిజాలు తెలియవని చెప్పవచ్చు.
వెంకటేష్ సినిమాలు..
వెంకటేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఇదివరకే వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ముచ్చటగా మూడోసారి ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కు భార్యగా నటిస్తూ ఉండగా, మీనాక్షి చౌదరి ఆయనకు మాజీ లవర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకోబోతోంది అని అభిమానులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. మరి సంక్రాంతి రేసులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.