BigTV English

SSMB: SSMB 28 డిజిటల్ హక్కుల ధ‌ర‌ తెలిస్తే షాకే!

SSMB: SSMB 28 డిజిటల్ హక్కుల ధ‌ర‌ తెలిస్తే షాకే!

SSMB :టాలీవుడ్‌లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీ ఒక‌టి. జ‌న‌వ‌రి మూడో వారంలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయంటే … ఈ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండ‌గానే డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ ఛానెల్ ఫ్యాన్సీ ధ‌ర‌కు చేజిక్కించుకుంది. సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు నెట్‌ఫిక్స్ రూ.81 కోట్ల‌ను చెల్లించి డిజిట‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంద‌ట‌. అంతే కాకుండా సినిమా విడుదలైన ఏడు వారాల త‌ర్వాతే డిజిట‌ల్‌లో సినిమా అందుబాటులోకి వ‌చ్చేలా ఇప్పుటికే మేక‌ర్స్ డీల్‌ను పూర్తి చేసేశార‌ట‌. శాటిలైట్ హ‌క్కుల‌ను ఈ రేంజ్‌లో బిజినెస్ కావ‌టం అనేది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధా కృష్ణ (చిన‌బాబు) ఈ మూవీని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ నెల‌లో విడుద‌ల చేయాల‌ని ముందుగా భావించారు కానీ.. మహేష్ తండ్రి కృష్ణ, ఆయన తల్లి ఇందిరా దేవి చనిపోవటంతో షెడ్యూల్స్ వాయిదాలు పడ్డాయి. దీంతో సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. రీసెంట్‌గా ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నామని సూర్యదేవర నాగవంశీ తెలిపారు. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా కోసం మ‌హేష్ త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. సిక్స్ ప్యాక్ లుక్‌లో ఆయ‌న క‌నిపించ‌బోతున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×