BigTV English

Alien Technology : గ్రహంతరవాసుల నుండి సిగ్నల్స్.. నిజమేనా..?

Alien Technology : గ్రహంతరవాసుల నుండి సిగ్నల్స్.. నిజమేనా..?

Alien Technology :కృత్రిమ మేధస్సు (ఏఐ) రాయగలదు, చదవగలదు, ఫోటోలను గుర్తించగలదు, పాటలు కూడా పాడగలదు. ఇన్నేళ్లుగా మానవాళిని ఇబ్బంది పెడుతున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇప్పుడు కష్టపడుతోంది. తాజాగా కృత్రిమ మేధస్సు అనేది శాస్త్రవేత్తలకు మరో విషయంలో సహాయపడుతుందని తేలింది.


ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇప్పటికే అంతరిక్షాన్ని స్టడీ చేసే పనిలో ఉంది. తాజాగా ఆ ప్రక్రియలో ఏఐ.. రేడియో సిగ్నల్ నుండి ఏలియన్స్ యొక్క టెక్నోసిగ్నేచర్స్ గుర్తించనునట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. టెక్నోసిగ్నేచర్స్ అనేవి కచ్చితంగా ఏలియన్ టెక్నాలజీకి సంబంధించనవే అని నమ్ముతున్న చాలామంది శాస్త్రవేత్తలు.. ఇప్పటివరకు వీటిని కనుక్కోవడానికి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ల వల్ల జరగని పని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా జరిగనుందని శాస్త్రవేత్తలు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అల్గోరిథమ్‌తో పనిచేసే టెలిస్కోప్‌ను 2016లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని సాయంతోనే ఏలియన్స్ టెక్నోసిగ్నేచర్స్‌ను వారు ట్రాక్ చేయనున్నారు. ఇంతకు ముందు వరకు ఏ శాస్త్రవేత్త కనుక్కోలేని ఎనిమిది సిగ్నల్స్‌ను ఈ టెలిస్కోప్ ట్రేస్ చేయనుంది. దీన్ని బట్టి చూస్తే అంతరిక్ష పరిశోధనలు పూర్తిగా ఏఐ చేతిలోకి వెళ్లిపోయేటట్టుగా అనిపిస్తోంది. పాత అల్గోరిథమ్స్ లాగా కాకుండా ఈ ప్రక్రియ అంతా ఒక న్యూరల్ నెట్‌వర్క్ సాయంతో సాగనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


ఏలియన్స్ ఉన్నాయా లేదా.. అసలు వాటి నుండి సిగ్నల్స్ వస్తున్నాయా లేదా.. అని కనిపెట్టడం అంత సులువైన విషయం కాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలాంటి గుర్తుతెలియని సిగ్నల్స్ మనకు అందినా కూడా.. వాటిని ట్రేస్ చేయకపోతే అవి అంతరిక్షంలోనే కలిసిపోయే అవకాశం ఉందని వారు అంటున్నారు. శాస్త్రవేత్తలు కనిపెట్టలేని ఎనిమిది సిగ్నల్స్ ఏలియన్స్ టెక్నాలజీ నుండే వచ్చినట్టు అనుమానాలు ఉన్నా.. అది పూర్తిగా నిర్ధారణ కాలేదు.

ఈ సిగ్నల్స్ ఏలియన్స్ నుండి వస్తున్నాయని కనిపెట్టినా.. అవి ఏలియన్ టెక్నాలజీ అని తెలిసినా.. అసలు అది ఏ టెక్నాలజీ అని కనుక్కోవడం కష్టమైన విషయమే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే ఆ సిగ్నల్స్ ఏలియన్స్ గురించి తగిన సమాచారాన్ని ఇవ్వాలని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. గ్రహంతరవాసుల గురించి సమాచారం తెలియడం పూర్తిగా ఏఐ టెలిస్కోప్‌పైనే ఆధారపడి ఉంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×