BigTV English

Mahesh Babu:జక్కన్న జైలుకు ఆ పనిచేసి మరీ వెళ్తానంటున్న మహేష్ బాబు

Mahesh Babu:జక్కన్న జైలుకు ఆ పనిచేసి మరీ వెళ్తానంటున్న మహేష్ బాబు

Mahesh Babu taking decision to interact with fans before going with Rajamouli movie shooting: ఘట్టమనేని కృష్ణ తెలుగునాట సూపర్ స్టార్ గా సుపరిచితుడు. అప్పట్లో ఎన్టీఆర్ తర్వాత మాస్ ఫాలోయింగ్ నటుడు ఎవరంటే హీరో కృష్ణ పేరే చెప్పేవారంతా. అయితే మహేష్ బాబు ఆయన నట వారసత్వం అందిపుచ్చుకుని..అచిరకాలంలోనే తండ్రికి మించిన తనయుడిగా టాలీవుడ్ లో తనకంటూ ఓ స్థాయిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. వరుసగా డబుల్ హ్యాట్రిక్ విజయాలతో టాలీవుడ్ టాప్ రేంజ్ కి చేరుకున్నాడు. అయితే ఇప్పటిదాకా మహేష్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలేవీ చేయలేదు. రీజనల్ హీరోగానే రెండు వందల మినిమం కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు .ఇక పాన్ ఇండియా మూవీ చేస్తే ఇంకెంత కలెక్షన్లు వసూలు చేస్తాడో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ చూపంతా మహేష్ నటించబోయే లెటెస్ట్ మూవీ పైనే ఉంది. ఎందుకంటే ఆ మూవీ దర్శకుడు పాన్ వరల్డ్ స్థాయి లో సినిమాలను రూపొందించిన రాజమౌళి కావడమే. ఎంతో కాలంగా వీరి కాంబినేషన్ మూవీ ఎప్పుడు ప్రారంభిస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు.


పాన్ వరల్డ్ స్థాయిలో.

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబు కోసం అంతర్జాతీయ రేంజ్ లో ఓ స్టోరీని సిద్ధం చేశారు. దాని స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని సమాచారం. మొన్న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందని ఆశించారంతా. అది జరగలేదు. రాజమౌళి ఏ మూవీని చేయాలన్నా కనీసం మూడేళ్లు తీసుకుంటారు. ఇప్పుడు మొదలైనా ఈ మూవీ విడుదలయ్యే సరికి మరో మూడేళ్లు ఆగాల్సి ఉంటుంది. ఇక అప్పటిదాకా మహేష్ బాబు కూడా ఏ మూవీకి కమిట్ అవ్వరు కూడా. అందుకే గుంటూరు కారం సినిమాలో మాస్ ఆడియన్స్ కు ఎంతకావాలో అంతా చూపించేశారు.


రీ రిలీజ్ లోనూ ట్రెండ్

మహేష్ కు ఉన్న ఫాన్ ఫాలోయింగ్ లో లేడీ ఫాన్స్ కూడా ఎక్కువే. రీసెంట్ గా రీ రిలీజ్ చేసిన మురారి మూవీ దాదాపు రూ.12 కోట్ల రేంజ్ కలెక్ట్ చేసి రీరిలీజ్ మూవీస్ లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే గుంటూరు కారం మూవీ తర్వాత మహేష్ బాబు మరో మూడేళ్ల దాకా కనబడరని అటు ఫ్యాన్స్..ఇటు మహేష్ బాబు కూడా ఫిక్సయిపోయారు. ఈ నేపథ్యంలో మహేష్ రాజమౌళి మూవీ షూటింగ్ మొదలు కాకముందే కొన్ని ముఖ్యమైన పనులు చేయాలని అనుకుంటున్నారట . త్వరలోనే తన అభిమానులతో కలిసి ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట. వీలు కాకపోతే కనీసం జూమ్ మీటింగ్ లో అయినా అభిమానులతో చిట్ చాట్ చేయాలని భావిస్తున్నారట. అయితే ఫ్యాన్స్ సూచనలు, సలహాలు తీసుకుని ఇంకా ఫ్యాన్స్ కు సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్ లో ఉంటే వాటిని పూర్తిచేశాకే జక్కన్న జైలుకు వెళతానంటున్నారు మహేష్ బాబు.

ఫ్యాన్స్ ఫిదా

మహేష్ బాబు కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో వస్తాయని అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ మాత్రం మహేష్ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రా, తెలంగాణలో వచ్చిన వర్షాలు, వరదలకు తమ సర్వస్వం కోల్పోయిన బాధితుల కోసం మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయల సాయం అందించిన విషయం విదితమే. తన సేవా దృక్పథం ద్వారా అనేక మంది పేద కుటుంబాలకు చెందిన చిన్నారుల గుండె ఆపరేషన్లు ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. రీల్ హీరోగానే కాదు రియల్ హీరోగానూ మహేష్ బాబు ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×