Bigg Boss 8 Telugu: బుల్లితెరపై ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్ బాస్’కు అద్భుతమైన ప్రేక్షకాదరణ లభించింది. మొదటి సీజన్ నుంచి ఈ షోకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీఆర్, నాని, నాగార్జున ఇలా ప్రతి ఒక్కరూ హౌస్ట్‌గా తనదైన శైలిలో దుమ్ముదులిపేశారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హౌస్ట్‌గా బాధ్యతలు వహించగా.. ఆ తర్వాత రెండవ సీజన్‌కు నాని ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ రెండు సీజన్లను ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత మూడో సీజన్‌ను ఆ బాధ్యతలను నాగ్ తన భుజాలపై వేసుకున్నాడు.
అలా ఏడు సీజన్ల వరకు ఆయనే హౌస్ట్‌గా నడిపించాడు. ఎక్కడా కొంచెం కూడా ఆదరణ పడిపోకుండా ఏడు సీజన్ల వరకు లాక్కొచ్చాడు. ఇక బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ‘బిగ్ బాస్ 8’ గ్రాండ్ లెవెల్లో సెప్టెంబర్ 1న ప్రారంభం అయింది. ఈ సీజన్ 8లో దాదాపు 14 మంది కంటెస్టెంట్‌లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మొదటి ఎపిసోడ్ నుంచే వీరిలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. చిన్న చిన్న విషయాలకే షార్ట్ టెంపర్ వచ్చినట్లు గొడవలు పడ్డారు.
హౌజ్‌లో ఎవరికి ఎవరూ తక్కువ కాదన్నట్లు బిహేవ్ చేశారు. మొదటిగా సోనియా ఆకుల అండ్ శేఖర్ భాషాకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆరేంజ్ పండ్లతో గేమ్ ఆడుతున్న తరుణంలో అలా ఆడకూడదని.. ఒకవేళ అలా ఆడిన వారు వాటిని తినకూడదని సోనియా చెప్తుంది. దీంతో ఆమె మాటలు శేఖర్ భాషాకు నచ్చవు దీంతో అతడు ఆమె మాటలను తప్పబడతాడు. నేను ఆడుతా.. అవే తింటా అంటాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలవుతుంది. ఆ తర్వాత అది చల్లబడ్డాక మళ్లీ వాళ్లిద్దరూ కలుసుకుని సరదాగా మాట్లాడుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ షో మొదటి రోజు నుంచి నాగ మణికంఠ అందరికీ టార్గెట్ అవుతున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన నాడు గెస్ట్‌గా వచ్చి దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ రోజునే ఒకరిని ఎలిమినేట్ చేయాలి చెప్పడంతో 14 మంది కంటెస్టెంట్‌లలో ఎక్కువ మంది నాగమణికంఠనే టార్గెట్ చేశారు. దీంతో అతడు చాలా ఫీలై తన లైఫ్ స్టోరీని చెప్పుకొచ్చాడు. తాను ఎన్నో కష్టాలు పడ్డానని, తల్లిదండ్రులను కోల్పోయానని, చివరకు భార్య పిల్ల కూడా దూరంగా ఉన్నారని, తాను చనిపోయే టైంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని.. ఇది తనకు చాలా అవసరం అని చెప్పుకొచ్చాడు.
Also Read: నామినేట్‌కు ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పారేంట్రాబాబు!
అయితే ఆ సమయంలో అతడి ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ విని చాలా మంది బాధపడ్డారు. అయితే ఈ షో మొదలై దాదాపు 4 రోజులు గడిచిపోయింది. అయినా నాగ మణికంఠనే టార్గెగా మిగులుతున్నాడు. అందుకు కారణం అతడి ఫ్లాష్‌బ్యాక్ స్టోరీనే అని చెప్పాలి. ప్రతి విషయంలోనూ తన జీవితంలో జరిగిన బాధల్ని చెప్పుకొస్తుండటంతో అది వినీ వినీ హౌజ్ మేట్స్‌కే కాకుండా బయట ఉన్న ఆడియన్స్‌కి సైతం చిరాకు తెప్పిస్తుంది. నామినేట్ చేస్తున్న ప్రతిసారి అదే విషయం చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు.
ఇదంతా ఒకెత్తయితే ఇప్పటి వరకు సింపతీ స్టార్‌గా పేరుపొందిన నాగమణికంఠ ఇప్పుడు విగ్ స్టార్‌గా మరో ముద్రను తనపై వేసుకున్నాడు. రీసెంట్‌గా నామినేషన్స్ అయ్యాక అతడు బెడ్ పై వచ్చి కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఇతర కంటెస్టెంట్లు మణికంఠ వద్దకు వచ్చి ఓదర్చుతారు. అప్పుడు మణికంఠ మాట్లాడుతూ.. తను గేమ్‌పై కన్సెంట్రేషన్ పెట్టలేకపోతున్నానని.. తనకు ఇంకెలా ఆడాలో తెలియడం లేదంటూ ఏడుస్తూ ఉంటాడు. ఆపై తను హెయిర్ ట్రాన్స్‌ప్లెంట్ చేసుకున్నానంటూ తలకున్న విగ్‌ను తీసి పక్కన పడేశాడు. దీంతో అంతా షాకవుతారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఎమోషనల్ స్టార్‌గా ఉన్న మణికంఠను ఇప్పుడు విగ్ స్టార్ అని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Arey Manikanta, entira edi mari over emotional ipotunavu.. Transparency kosam wig testesava? Mari what else is pending..
Nikhil spoke the facts! 💯#S8E4 #BiggBossTelugu8 pic.twitter.com/KrWLBrGbR9
— Mr.Legend (@MrLegendHero) September 5, 2024