Tamil filmmakers : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. కొన్నిసార్లు వాళ్లను వెండితెరపై చూస్తుంటే, వాళ్లు ఆ పాత్రలో ఉన్నట్లే అనిపిస్తారు. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు బాసతో సంబంధం లేకుండా మిగతా భాషల్లో ఉన్న నటులను కూడా ఇష్టపడడం మొదలు పెడుతున్నారు. ఇటువంటి ప్రాంతీయ అభిమానం అనేది లేకుండా ప్రతి లాంగ్వేజ్ లో సినిమాలు చూడడం మొదలు పెడుతున్నారు. ఇలా చాలా సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంకరేజ్ చేశారు. అలానే ఒక నటుడు సినిమా నచ్చినట్లయితే అంతకుముందు ఆ నటుడు చేసిన సినిమాలను కూడా వెతికి మరి చూస్తున్నారు. ఇక మలయాళం ఇండస్ట్రీలో ఉన్న జోజు జార్జి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆదికేశవ అనే సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
తమిళ దర్శకులు హిట్స్ ఇవ్వడం లేదు
జోజు జార్జ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా ఇరక్ట, జోసెఫ్ వంటి సినిమాలలో జోజు చేసిన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. చాలామంది జోజు సినిమాలను వెతుక్కుని చూస్తుంటారు. ఇక ప్రస్తుతం మలయాళంలో మాత్రమే కాకుండా జోజు అన్ని భాషల్లో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు తెలుగులో ఐదు సినిమాలను చేశారు జోజు. వీటిలో రెండు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన రెట్రో సినిమాలో కూడా జోజు నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్ సినిమా గురించి చెప్పడానికి కూడా ఏం లేదు. మొదటి షో నుంచి ఇది డిజాస్టర్ టాక్ సాధించుకుంది. ఈ సినిమా కూడా జోజుకి పేరు తీసుకురాలేదు. ఐదు సినిమాలు చేసినా కూడా తనను ఒకరు కూడా సరిగ్గా వాడుకోలేదు అనేది కొంతమంది అభిప్రాయం.
జోజు సినిమా కెరియర్
1995లో విడుదలైన మజవిల్కూడరం చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్‌గా జోజు నటుడిగా అరంగేట్రం చేశాడు . ఆ తర్వాత 1990ల చివరలో మరియు 2000లలో అనేక చిన్న పాత్రలు పోషించాడు. 2010లలో, అతను క్రమంగా సహాయక పాత్రలు చేయడం మొదలుపెట్టారు. 2015లో, అతను ఒరు సెకండ్ క్లాస్ యాత్ర , యాత్ర చోడిక్కతే మరియు లుక్కా చుప్పీ చిత్రాలలో సహాయక పాత్రలకు తన మొదటి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు (స్పెషల్ మెన్షన్)ను గెలుచుకున్నాడు. 2018లో ఎం. పద్మకుమార్ దర్శకత్వం వహించిన జోసెఫ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా అతని మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత చేసిన చాలా సినిమాలు జోజుకి మంచి ప్లస్ గా మారాయి.
Also Read : Thug Life : గో బ్యాక్ ఇండియన్ అని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావ్?