Pushpa2 TheRule : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లకు వేరే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వీళ్ళ పాత సినిమాలు రీ రిలీజ్ అయితే కలెక్షన్లు మోత మోగిస్తాయి. ఇదివరకే పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు,జల్సా, తొలిప్రేమ వంటి సినిమాలు, మహేష్ బాబు నటించిన ఒక్కడు పోకిరి వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రీ రిలీజ్ అయ్యాయి. రీ రిలీజ్ అవ్వడమే కాకుండా అసలు సెలబ్రేషన్ అంటే ఏంటో ఇప్పుడున్న యూత్ కి ఆ సినిమాలు రుచి చూపించాయి. చాలామంది సూపర్ హిట్ సినిమాలను అప్పట్లో టీవీలో మాత్రమే చూశారు. అదే సినిమాలను ఇప్పుడు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయటం అనేది మామూలు అనుభూతి కాదు. ఇకపోతే మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి సంబంధించి మిశ్రమ స్పందన వచ్చిన కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వలన ఈ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.
ఇక ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ జరగనుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీని కారణం ఇదివరకే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా సాధించిన విజయం అని చెప్పాలి. కేవలం సినిమా హిట్ అవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని అమాంతం ప్రపంచానికి తెలిసేలా చేశాడు ఎస్.ఎస్ రాజమౌళి. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇక మహేష్ బాబుతో ఉండబోయే సినిమా కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేయనుంది అని చాలామందికి తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు జర్మనీలో ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 నేడు రిలీజ్ అయింది. ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఈ సినిమాను రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీలో చూడనున్నట్లు తెలుస్తుంది. కేవలం మహేష్ బాబు కోసం ఈ షో ను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు ఇదివరకే నేనొక్కడినే అనే సినిమా చేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సరైన సక్సెస్ సాధించలేదు. కానీ ఈ సినిమాకి ఇప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. లేకపోతే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ కొన్ని టెక్నికల్ డిఫరెన్సెస్ వలన ఆ సినిమా ఆగిపోయినట్లు అఫీషియల్ గానే ప్రకటించారు.
Also Read : Sobhita Dhulipala: అక్కినేని ఇంటి కోడలు.. అప్పుడే సమంతను వెనక్కి నెట్టేసిందిగా