BigTV English
Advertisement

Mahesh Babu : రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఆ డైరెక్టరకే

Mahesh Babu : రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఆ డైరెక్టరకే

Mahesh Babu : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. పోకిరి లాంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మహేష్ బాబు సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా మంచి లాభాలతో సినిమా సాగిపోయింది. దీనికి కారణం మహేష్ బాబుకి ఉన్న ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ అని ఖచ్చితంగా చెప్పాలి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.


అంచనాలన్నీ ఈ సినిమాపై

స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఎస్ ఎస్ రాజమౌళి ప్రతి సినిమాతోనూ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించి మంచి అంచలంచెలుగా ఎదిగాడు. తాను ఎదగడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా అమాంతం పెంచారు ఎస్ఎస్ రాజమౌళి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమాను మిగతా ఇండస్ట్రీలు చూసే దృక్కోణం మారిపోయింది. ట్రిపులర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి గుర్తింపు తీసుకొచ్చింది. ఒక ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రేక్షకులంతా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.


రాజమౌళి తర్వాత ఆ దర్శకుడికి అవకాశం

మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేస్తాడు అని తెలుస్తోంది. ఈలోపు సందీప్ రెడ్డివంగా స్పిరిట్, అలానే అ
యానిమల్ పార్క్ సినిమాను పూర్తి చేయనున్నాడు. అనిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకొని అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. యానిమల్ పార్క్ సినిమా పైన కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రాజమౌళి సినిమా పూర్తి అయ్యేసరికి కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈలోపు ఈ రెండు సినిమాలను పూర్తి చేసి తర్వాత మహేష్ బాబుతో సినిమాను చేయనున్నాడు. వాస్తవానికి మహేష్ బాబు అర్జున్ రెడ్డి సినిమా తర్వాతే సందీప్ రెడ్డి వంగతో పని చేయాలనుకున్నారు. డెవిల్ అనే ఒక కథను కూడా మహేష్ బాబుకి చెప్పాడు సందీప్. అది ఇంకా పట్టాలెక్కలేదు. బహుశా అదే కథను మహేష్ తో చేస్తాడేమో వేచి చూడాలి.

Also Read : Lokesh Kanagaraj: సూర్యతో సినిమా ఉంది, కానీ నేను ఇప్పుడు మొదలు పెట్టేది ఇదే

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×