Sankranthiki Vastunam: ఇద్దరు ఆడవారి మధ్య వెంకీ మామ నలిగితే ఆ సినిమా హట్టే అని అనిల్ రావిపూడి చెప్పినట్టే జరిగింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఎఫ్ 2, ఎఫ్3 తరువాత వెంకీ- అనిల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా బుల్లిరాజు పాత్రను మరింత మెచ్చుకుంటున్నారు.
మీనాక్షీ, ఐశ్వర్య రాజేష్ ల మధ్య వెంకీ మామ ఎలా నలిగిపోయాడు అనేది ఎంతో వినోదాత్మకంగా చూపించడంతో పాటు చివర్లో ఒక మెసేజ్ ను కూడా అందించాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యిన మూడు రోజుల్లోనే ఏకంగా 106 కోట్ల గ్రాస్ ని రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. గేమ్ ఛేంజర్ నష్టాలతో బాధల్లో ఉన్న దిల్ రాజుకు ఈ సినిమా కొంతవరకు ఉపశమనాన్ని అందించింది. ఇక ఈ భారీ సక్సెస్ ను చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకున్నారు.
Manchu Manoj: నా పెళ్లాం గొడవలు వద్దంది కాబట్టి ఆగాను.. లేకపోతే నీ తల నరికి.. మనోజ్ ఇంకో పోస్ట్
ఇప్పటికే సక్సెస్ మీట్ ను దిల్ రాజు ఏర్పాటు చేయగా .. వెంకీ మామ దానికి మించిన పార్టీని తన ఇంట్లో ఇచ్చాడు. గతరాత్రి వెంకీ మామ ఇంట్లోనే సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా విచ్చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మేకర్స్ అధికారికంగా అభిమానులతో పంచుకున్నారు. చాలాకాలం తరువాత చిన్నోడు పెద్దోడు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. ఈ ఇద్దరు రీల్ అన్నదమ్ములకు పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. మహేష్ తో ఈ డైరెక్టర్ సరిలేరు నీకెవ్వరూ సినిమా చేశాడు.
సినిమా రిలీజ్ అయిన తెల్లారే మహేష్ వీక్షించి తన రివ్యూ కూడా ఇచ్చాడు. ఇక పెద్దోడి పార్టీలో చిన్నోడే హైలైట్ గా మారాడు. తన భార్య నమ్రతతో సహా ఈ పార్టీకి హాజరయ్యాడు మహేష్. బ్లాక్ కలర్ టీ షర్ట్, హెయిర్ ను కవర్ చేసే రెడ్ క్యాప్ తో మహేష్ లుక్ అదిరిపోయింది. SSMB29 కోసం ఆ లుక్ ను మెయింటైన్ చేస్తున్నాడన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక చిన్నోడిని, పెద్దోడిని ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు మరో మల్టీస్టారర్ చేయమని కోరుతున్నారు. మరి భవిష్యత్తులో ఈ కాంబో రిపీట్ అవుతుందో లేదో చూడాలి.
A blockbuster reunion of CHINNODU – PEDDODU😍🔥
From appreciating to celebrating #BlockbusterSankranthikiVasthunam together ❤️🔥
Candids of Superstar @UrstrulyMahesh with team #SankranthikiVasthunam from the success party❤️
Victory @venkymama @anilravipudi @aishu_dil… pic.twitter.com/VGGwqK0iEq
— Sri Venkateswara Creations (@SVC_official) January 17, 2025