TTD News: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మర్షి డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుకు అవమానం జరిగిందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో బ్రహ్మర్షి డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందని ప్రచారం అవుతున్న నేపథ్యంలో చైర్మన్ స్పందించారు.
చైర్మన్ ఇచ్చిన వివరణ మేరకు.. ప్రతి ఏడాది జనవరి మాసంలో డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు తిరుమల వచ్చి శ్రీవారిని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందులో భాగంగా జనవరి 14వ తేదీన శ్రీవారి దర్శనం, 16వ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ 20వ తేదీన ప్రొసీడింగ్స్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ఉండడంతో జనవరి 14వ తేదీన శ్రీవారి దర్శనం ఏర్పాట్లను టీటీడీ చేసిందని వివరణ ఇచ్చారు. అయితే రామ్ బగీచా గెస్ట్ హౌస్ నుండి శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్లేందుకు బగ్గీస్, అదేవిధంగా బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు కూడ టీటీడీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
వయసు రీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్నా, చాగంటి సున్నితంగా తిరస్కరించారని వివరణ ఇచ్చారు. సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి చేరాలని స్వయంగా చాగంటి సూచించినట్లు తెలిపారు. ఆ సూచనతోనే వారే స్వయంగా వైకుంఠ కాంప్లెక్స్ నుండి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారన్నారు.
Also Read: DCM Pawan Kalyan: రంగంలోకి పవన్ కళ్యాణ్.. అవినీతి అధికారులకు ఇక చుక్కలే
అలాగే జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి ప్రవచన కార్యక్రమాన్ని మరువ తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని టీటీడీ అధికారులు సూచించారని, దీనితో మరోసారి ఆయన తేదీలను తీసుకుని ప్రవచనాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అయితే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా చాగంటి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని చైర్మన్ ఖండించారు. ఇటువంటి ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారికి అవమానం అంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా ఆవాస్తవం.
అసలు వాస్తవం .. #AdminPost #TTD #TirumalaDarshan #tirumalatirupatidevasthanam #tirumala #TTDevasthanams pic.twitter.com/3j6JzjUEhO
— B R Naidu (@BollineniRNaidu) January 17, 2025