BJP Manifesto : దిల్లీ అసెంబ్లీలో ఎలాగైనా గెలుపు బావుటా ఎగురవేయాలని గట్టుదట్టి పలతో ఉన్న బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ మ్యానిఫెస్టోలతో ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే.. ఆమ్ ఆద్మీ పార్టీ తన మ్యానిఫెస్టోను ప్రకటించగా, ఇప్పుడు బీజేపీ కూడా ప్రకటించింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక పథకాలకు అందులో చోటు కల్పించింది. దిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే గర్భణీ స్త్రీలకు రూ.21 వేల ఆర్థిక సాయం చేస్తామని, గ్యాస్ సిలిండర్లపై సబ్సీడీతో పాటు, మహిళలకు నెలవారీగా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. బీజేపీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఇతర హామీలు..
దిల్లీలోని ప్రాంతీయ పార్టీ కార్యాలయంలో ‘సంకల్ప పత్రా’ పార్ట్-1 పేరుతో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తమ పార్టీ హామీలతో పాటు ప్రస్తుతం దిల్లీలో అమల్లో ఉన్న అన్ని పథకాల్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ఇందులో..
అవినీతిపై తొలి పోరు..
పార్టీ మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శనాస్త్రాలు సంధించారు. దిల్లీలో వచ్చే ఎన్నికల్లో తాము తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన నడ్డా.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించించారు. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ లో చేరకపోవడం వల్ల దిల్లీలోని 51 లక్షల మంది ప్రజలు వైద్య ప్రయోజనాల్ని కోల్పోయారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాడిన తొలి మంత్రి వర్గ సమావేశంలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని నడ్డా వెల్లడించారు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని మొహల్లా క్లీనిక్ లు అవినీతికి నిలయాలుగా మారాయని.. అక్కడ కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. దాదాపు రూ.300 కోట్ల ప్రజల సొమ్మును ఈ క్లీనిక్ లను అడ్డుపెట్టుకుని దోచుకున్నారంటూ జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. బీజేపీ గెలిస్తే.. ఆప్ అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని వెల్లడించారు.
Also Read : రోడ్డు నాణ్యత బాగోలేదా అయితే వాళ్లంతా జైలుకే.. కేంద్రం కొత్త రూల్
దిల్లీలో మహిళలకు ప్రతినెలా రూ.2,100 ఇస్తామని ఆప్ ప్రభుత్వం హామీ ఇస్తుందని.. అలాంటప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ లో ఎందుకు ఆర్థిక సాయం చేయడం లేదని ప్రశ్నించారు. కనీసం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లపై రాయితీని కూడా అందించడం లేదని మండిపడ్డారు.