Mahesh Babu Meets Cricketer Pat Cummins: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం SSMB29 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ తన మేకోవర్ ను మార్చే పనిలో ఉండగా.. జక్కన్న ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక మహేష్ లుక్ బయటకు రాకుండా ఎంతో జాగ్రత్త వహిస్తున్నాడు. అయితే తాజాగా మహేష్ న్యూ లుక్ బయటపడిపోయింది.
ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క యాడ్ షూట్స్ తో బిజీగా ఉండే మహేష్.. తాజాగా ఒక యాడ్ షూట్ లో SRH టీమ్ తో మహేష్ సందడి చేశాడు. SRH టీమ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, మయాంక్ అగర్వాల్ ను మహేష్ కలిశాడు. వారితో కొద్దిసేపు ముచ్చటించాడు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇండియన్ మహేష్ బాబుతో ఆస్ట్రేలియన్ మహేష్ బాబు అని కొందరు.. కిర్రాక్ ఉన్నారు అని ఇంకొందరు కామెంట్స్ పెట్టుకొస్తున్నారు.
Also Read: Pawan Kalyan: ‘ఎక్స్’ ను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. ఇదెక్కడి మాస్ రా మావా
ఇక మహేష్ బాబు సైతం ఈ పాట్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇది నాకు పెద్ద గౌరవం.. మీకు పెద్ద అభిమానిని అంటూ రాసుకొచ్చాడు. ఇక ఇదంతా పక్కన పెడితే.. మహేష్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. బ్లాక్ హుడీ, బ్లూ జీన్స్.. గడ్డం, లాంగ్ హెయిర్ తో రగ్గడ్ లుక్ తో షేక్ చేసేశాడు. SSMB29 లుక్ ఇదే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో మహేష్- రాజమౌళి ఎలాంటి రికార్డులు బద్దలుకొడతారో చూడాలి.
An absolute honour! A big fan! 🤗🤗🤗 https://t.co/nIuVhwWPx4
— Mahesh Babu (@urstrulyMahesh) April 22, 2024
SunRisers 🤝 Superstar of Telugu cinema, Mahesh Babu 👑🧡 pic.twitter.com/Nd4MQWCfi8
— SunRisers Hyderabad (@SunRisers) April 22, 2024