E-Paper
Advertisement

Superstar Krishna: తండ్రి మరణం తర్వాత మహేష్ కీలక నిర్ణయం.. కృష్ణ మెమోరియ‌ల్ ఏర్పాటు

Superstar Krishna: తండ్రి మరణం తర్వాత మహేష్ కీలక నిర్ణయం.. కృష్ణ మెమోరియ‌ల్ ఏర్పాటు
Advertisement

టాలీవుడ్ సీనియర్ నటుడు, నటశేఖర కృష్ణ అంద‌రినీ విడిచి సుదూర లోకాల‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న అంత్య‌క్రియ‌లు కూడా పూర్త‌య్యాయి. ఆయ‌న సినిమాలు, వ్య‌క్తిత్వంతో మ‌న మ‌ధ్య‌లోనే ఉంటార‌న‌టంలో సందేహం లేదు. అయితే త‌న తండ్రిని ఎంత‌గానో ప్రేమించే అభిమానుల కోసం కృష్ణ మెమోరియ‌ల్‌ను ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు నిర్ణ‌యించారు. ఇందులో కృష్ణ విగ్ర‌హంతో పాటు ఆయ‌నకు సంబంధించిన అరుదైన ఫొటోల‌ను, ఆయ‌న సాధించిన ఘ‌న‌త‌లు, అవార్డుల‌ను ఉంచ‌బోతున్నారు. అది కూడా కృష్ణ స్థాపించిన ప‌ద్మాల‌యా స్టూడియోస్‌లోనే అని స‌మాచారం. దీనికి సంబంధించి మ‌రింత క్లారిటీ త్వ‌ర‌లోనే రానుంద‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. కృష్ణ కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు, సినీ ప్రేక్షకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మూడు షిఫ్టుల‌లో ప‌నిచేస్తూ నిర్మాత‌ల పాలిట క‌ల్ప వృక్షంలా కృష్ణ 350కి పైగా చిత్రాల్లో న‌టించారు. సామాన్య నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన సూపర్‌స్టార్ డమ్‌తో మాస్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. కేవ‌లం న‌టుడిగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, స్టూడియో అధినేత‌గా తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఆయ‌న త‌న‌దైన అధ్యాయాన్ని రాశారు. తెలుగు సినిమాను సాంకేతికంగా కొత్త పుంత‌లు తొక్కించిన ఘ‌న‌త కృష్ణ‌కే ద‌క్కుతుంది. ఇప్పుడాయ‌న న‌ట వార‌సుడిగా సూప‌ర్‌స్టార్ మ‌హేష్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×