Amazon Layoffs : సంస్థ ఉద్యోగులను ఏరివేయడంలో ఇప్పుడు ట్విట్టర్ తరువాత అమెజాన్ వంతు వచ్చింది. త్వరలో అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోతలు జరుగనున్నట్లు అమెరికన్ న్యూస్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవసరం లేదనకున్న ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు అమెజాన్ హార్డ్‌వేర్ ఛీఫ్ డేవ్ లింప్ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. అమెజాన్‌ను మళ్లీ బలంగా పునర్నిర్మించే దాంట్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లింప్ పేర్కొన్నారని సంబంధింత వర్గాలు చెబుతున్నాయి.
అయితే తొలగించిన ఉద్యోగులకు వేరే అవకాశం చూపించే విధంగా సంస్థ సహాయసహకారాన్ని అందిస్తుందని లింప్ హామీ ఇచ్చినట్లు ఇన్‌సైడ్ టాక్. తాజాగా జరిపే లేఆఫ్స్‌లో సుమారు 10వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. హ్యూమెన్ రిసోర్సస్, రిటైల్, డివైజస్ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రధానంగా ఉండనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ సంస్థలో పనిచేస్తున్న మ్యానేజర్లకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలను తొలగిస్తున్న విషయాన్ని అమెజాన్ అధికార ప్రతినిధి కెల్లీ నాన్‌టెల్ కూడా కన్ఫర్మ్ చేశారు.