Indian Railways Ticket Rules: రైలు ప్రయాణం చేయాలంటే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి కొద్ది రోజుల ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. రైలు టికెట్లను స్టేషన్ లోని కౌంటర్ లో లేదంటే ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, కొన్నిసార్లు ట్రైన్ ఫ్లాట్ ఫారం మీదికి వచ్చి నిలబడ్డ తర్వాత అకస్మాత్తుగా జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో కూడా ట్రైన్ లో వెళ్లే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, సింఫుల్ గా ప్లాట్ ఫారం టికెట్ కొనుగోలు చేయాలి.
ప్లాట్ ఫారం టికెట్ తో జర్నీ ఎలా?
అత్యవసర రైలు ప్రయాణం సమయంలో రిజర్వేషన్ టికెట్ లేకున్నా, ప్లాట్ ఫారం టికెట్ తో రైలు ప్రయాణం చెయ్యొచ్చు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ప్లాట్ ఫారం టికెట్ తో ట్రైన్ ఎక్కిన వాళ్లు వెంటనే టీటీఈ దగ్గరికి వెళ్లాలి. ఆయనకు ప్లాట్ ఫారం టికెట్ చూపించి, విషయం చెప్తే, ఆయన టికెట్ జారీ చేస్తారు. భారతీయ రైల్వే సంస్థ టికెట్ రూల్స్ లో ఈ నియమాన్ని చేర్చింది. ఫ్లాట్ ఫారం ఆధారంగా తను ఎక్కిన స్టేషన్ నుంచి తను దిగాల్సిన స్టేషన్ వరకు టికెట్ అందిస్తారు.
సీట్లు ఖాళీగా లేకపోతే ఏంటి పరిస్థితి?
రిజర్వేషన్ లేకుండా ప్లాట్ ఫారం టికెట్ తో ట్రైన్ ఎక్కితే ఒక్కోసారి సీటు దొరకదు. కొన్నిసార్లు పూర్తి రిజర్వేషన్ ఉంటే, రిజర్వేషన్ సీటు లభించదు. కానీ, రైల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తారు. మీకు రిజర్వేషన్ లేకపోతే, మీరు ఎక్కిన స్టేషన్ నుంచి దిగాల్సిన స్టేషన్ వరకు టికెట్ ధరతో పాటు అదనంగా రూ. 250 జరిమానా విధించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయానికి ముందు ఈ విషయాలను తెలుసుకోవాలి.
ప్లాట్ ఫారం టికెట్ స్టేషన్ నుంచి ఛార్జీ వసూలు
ప్లాట్ ఫారం టికెట్ ప్యాసింజర్ ను రైలు ఎక్కేందుకు అనుమతి ఇస్తుంది. ప్లాట్ ఫారం టికెట్ అనేది ఏ స్టేషన్ లో రైలు ఎక్కారో చెప్పేందుకు ఉపయోగపడుతుంది. ప్రయాణీకుడు ప్లాట్ ఫారం టికెట్ తీసుకున్న స్టేషన్ నుంచి అతడు దిగాల్సిన స్టేషన్ వరకు ఛార్జీని చెల్లించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఫ్లాట్ ఫారం టికెట్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది.
Read Also: వెయిటింగ్ లిస్టు టికెట్ల కన్ఫర్మేషన్ వెనుక ఇంత కథ ఉందా? అసలు విషయం చెప్పిన రైల్వే సంస్థ!
టికెట్ క్యాన్సిలేషన్ తో భారీగా ఆదాయం
ఇక భారతీయ రైల్వే సంస్థకు టికెట్ల అమ్మకం ద్వారానే కాకుండా టికెట్ల క్యాన్సిలేషన్ ద్వారా కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది. ప్రతి ఏటా సుమారు రూ. 1000 కోట్లకు పైగా ఆదాయాన్ని రైల్వే సంస్థ పొందుతున్నట్లు తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో తెలిపారు. ఆ డబ్బును రైల్వే సేవలను మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అయితే, కన్ఫర్మ్ కాని టికెట్లకు కూడా క్యాన్సిలేషన్ ఫీజ్ తీసుకోవడాన్ని పలువురు ఎంపీలు తప్పుబట్టారు. ఈ విషయంపై పునరాలోచించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Read Also: ట్రైన్ టికెట్లు ఈజీగా బుక్ చేసుకునే బెస్ట్ యాప్స్ ఇవే, మీరూ ట్రై చేయండి!