BigTV English

Anushka: అనుష్క బర్త్‌ డేకు స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ.. ‘ఘాటీ’ నుండి కీలక అప్డేట్

Anushka: అనుష్క బర్త్‌ డేకు స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ.. ‘ఘాటీ’ నుండి కీలక అప్డేట్

Anushka Shetty: కొందరు నటీనటులు రెగ్యులర్‌గా స్క్రీన్ పై కనిపించకపోయినా, ఫ్యాన్స్‌లో టచ్‌లో ఉండకపోయినా వారి మీద ప్రేమ, అభిమానం ఏ మాత్రం తగ్గవు. అలాంటి నటీమణుల్లో అనుష్క శెట్టి కూడా ఒకరు. వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి, పవర్‌ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరించి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది అనుష్క. కానీ ఏమైందో తెలియదు.. గత కొన్నేళ్లు తను సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. సోషల్ మీడియాలో కూడా తను అంత యాక్టివ్ కాదు. అంతే కాకుండా తను నటించిన సినిమా ప్రమోషన్స్‌కు కూడా అసలు ఫ్యాన్స్‌ను కలవపడానికి ఇష్టపడడం లేదు. ఇక ఇన్నాళ్ల తర్వాత అనుష్క బర్త్ డేకు ఒక సర్‌ప్రైజ్ రెడీ అవుతోంది.


కీలక అప్డేట్

‘బాహుబలి’ తర్వాత అనుష్క నటించే సినిమాల సంఖ్య చాలా తగ్గిపోయింది. 2017లో ‘బాహుబలి 2’ విడుదలయిన తర్వాత తను కేవలం మూడు సినిమాల్లో మాత్రమే కనిపించింది. అందులో రెండు సూపర్ హిట్ అయినా కూడా వెంటవెంటనే సినిమాలు చేయడానికి అనుష్క అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ఫైనల్‌గా అసలు అనుష్కను వెండితెరపై చూస్తామా లేదా అని ఆశలు వదిలేసుకున్నారు ఫ్యాన్స్. ఇంతలోనే ‘ఘాటీ’ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి అనుష్క సిద్ధమయ్యిందనే వార్త బయటికొచ్చింది. ఇప్పుడు ఈ మూవీ నుండి మరొక స్పెషల్ అప్డేట్ బయటికి రానుంది.


Also Read: స్వీటీ బర్త్ డే సర్ప్రైజ్ లోడింగ్… ఈసారి డబుల్ ధమాకా

స్పెషల్ సర్‌ప్రైజ్

క్రిష్ (Krish) దర్శకత్వంలో అనుష్క (Anushka) నటిస్తున్న చిత్రమే ‘ఘాటీ’ (Ghaati). ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటికొచ్చింది. ఇందులో అనుష్క మధ్య వయసు ఉన్న మహిళగా కనిపించనుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. అంతకు మించి ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. ఇక నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా ‘ఘాటీ’ మేకర్స్ ఒక స్పెషల్ సర్‌ప్రైజ్‌ను సిద్ధంగా చేశారు. ఆరోజే ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని సన్నాహాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఇక నవంబర్ 7నే ‘ఘాటీ’ షూటింగ్‌కు కూడా గుమ్మడికాయ కొట్టేస్తారని సమాచారం.

రిలీజ్ డేట్ ఎప్పుడో

‘ఘాటీ’ షూటింగ్ పూర్తయ్యింది. స్పెషల్ గ్లింప్స్ కూడా విడుదల కానుంది. అంటే త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పుట్టినరోజు సందర్భంగా ‘ఘాటీ’ రిలీజ్ డేట్‌పై కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అనుష్క చివరిగా 2023లో విడుదలయిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో థియేటర్లలో సందడి చేసింది. ఒక డిఫరెంట్ స్టోరీ, ఫీల్ గుడ్ కథనంతో ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా అనుష్క అసలు బయటికి రాలేదు. ఇప్పటికైనా స్వీటిని ఆఫ్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Ghaati
Ghaati

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×