BigTV English

Chiranjeevi Charitable Trust: చిరంజీవి ఐ సెంటర్‌కి సోద‌రి క‌ళ్లను దానం చేసిన మేక‌ప్‌మ్యాన్

Chiranjeevi Charitable Trust: చిరంజీవి ఐ సెంటర్‌కి సోద‌రి క‌ళ్లను దానం చేసిన మేక‌ప్‌మ్యాన్

Makeup Artist Who Donated sister’s eyes to Chiranjeevi Eye Centre: మెగాస్టార్ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ని అక్టోబర్ 2, 1998 న జూబ్లీహిల్స్‌లో ప్రారంభించారు. తన ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేశారు. అంతేకాకుండా కళ్లు లేని వారికి తిరిగి చూపును ప్రసాదించేలా నేత్రదానంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇక ప్రమాదంలో ఉన్న క్షతగాత్రులకు స‌కాలంలో ర‌క్తాన్ని అందించే సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ముందుంటుంది. ఇప్పటివరకు 9,30వేల మందికి రక్తదానంతో సహాయాన్ని అందించారు.


కళ్లు లేని 9060 మందికి నేత్రదానం ద్వారా కళ్లను అందించారు. అంతేకాదు 2002 కరోనా టైమ్‌లో క్వారంటైన్లో ఉన్న పేదలకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సీజన్‌ బ్యాంక్‌ని ఏర్పాటు చేసి ఆపదలో ఉన్నవారికి సహాయం అందించారు. వీరి సేవలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం 2005 లో బెస్ట్ వాలంటరీ బ్లడ్‌ బ్యాంక్ అవార్డుతో సత్కరించింది. ఇక తాజాగా తెలుగు టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీ మోహ‌న్ మేక‌ప్ మ్యాన్ కొల్లి రాము సోద‌రి ప‌మిడి ముక్కల రాజ్యల‌క్ష్మి మంగ‌ళ‌వారం ఉద‌యం అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని కుటుంబసభ్యులు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్‌కి చేర‌వేయ‌గా వెంట‌నే ఛారిటబుల్‌ ట్రస్ట్ వారు స్పందించారు.

Also Read: ఇంద్ర రీ-రిలీజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్‌..


అలా రాజ్యల‌క్ష్మి తాను చ‌నిపోయిన‌ప్పటికీ నేత్రదానం చేయ‌టం ద్వారా మ‌రో ఇద్దరికీ చూపును అందిస్తుందని వారంతా కొనియాడారు. అంతేకాదు ఈవిడ ఎంద‌రికో ఆద‌ర్శప్రాయంగా మారారని అన్నారు. ఈ సంద‌ర్భంగా ముర‌ళీమోహ‌న్‌కి, కొల్లి రాము ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్‌ నిర్వాహకులు ప్రత్యేకంగా ధ‌న్యవాదాల‌ను తెలియ‌జేశారు. ప్రస్తుతం ఈవిడ నేత్రాలను అందించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఆమె కళ్ల దానంతో మరో ఇద్దరికి చూపుని కలిగిస్తుందంటూ, మరికొందరు ఆవిడ చనిపోయినా.. వారి చికటి జీవితాల్లో వెలుగుని నింపుతుందని కొనియాడారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×