Shahid Afridi: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతిథ్య పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ ట్రోఫీ హెబ్రీడ్ మోడల్ కారణంగా భారత జట్టు తన అన్ని మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడింది. మిగతా జట్లన్నీ పాకిస్తాన్ లోనే ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఇక ఈ ట్రోఫీలొ అన్ని మ్యాచ్లలో విజయం సాధించి భారత్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
Also Read: Ravi Shastri: కోహ్లీ కోసం రూల్స్ మార్చిన బీసీసీఐ..డేటింగ్ లో కూడా !
ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టీ-20 లు, 3 వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టును ఇప్పటికే ప్రకటించారు. టి-20 జట్టులోకి ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగివచ్చాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రీది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టి-20 జట్టులోకి ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి రావడాన్ని ఆఫ్రిది ప్రశ్నించాడు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పుడు నిర్ణయాల కారణంగా పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉందని అభిప్రాయపడ్డాడు. షాహిద్ ఆఫ్రిది మీడియాతో మాట్లాడుతూ.. ” ఏ ప్రాతిపాదికన అతడిని తిరిగి పిలిపించారు. దేశవాళీ క్రికెట్ లో అతని ప్రదర్శన అస్సలు బాగోలేదని మీరే అన్నారు. ఇప్పుడు మళ్లీ అతడిని తిరిగి జట్టులో ఎలా ఎంపిక చేశారు. అర్హత ఆధారంగా నిర్ణయాలు తీసుకోనంతవరకు పాకిస్తాన్ క్రికెట్లో ఎలాంటి మార్పులు ఉండవు.
పాకిస్తాన్ క్రికెట్ తప్పుడు నిర్ణయాల కారణంగా జట్టు ఇప్పుడు ఐసీయూలో ఉంది. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరించినప్పుడల్లా ఆయన వచ్చి ప్రతిదీ మారుస్తూ ఉంటారు. బోర్డు నిర్ణయాలు సరైనవి కావు. వారు నిరంతరం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కువ కాలం నిలిచి ఉండే నిర్ణయాలు తీసుకోవడం లేదు. కెప్టెన్లను, కోచ్ లను, కొంతమంది ఆటగాళ్లను మారుస్తూనే వస్తున్నారు. బోర్డు జవాబుదారీతనం ఇదేనా..? కోచ్ తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఆటగాళ్లను నిషేధించడం బాధగా ఉంది.
Also Read: WPL 2025: ఫైనల్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్..ఈ సారి కప్పు కొట్టేనా?
అడగాళ్లను, కోచ్ ని తమ స్థానాన్ని కాపాడుకోవడానికి యాజమాన్యం నిందించడం చూస్తే బాధగా ఉంది. కోచ్, కెప్టెన్ తలలపై డెమోక్లెస్ కత్తి నిరంతరం వేలాడుతుండడం కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలా పురోగమిస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వి సానుకూల వ్యక్తి అని నేను అనుకున్నాను. కానీ అతడికి క్రికెట్ గురించి పెద్దగా ఏమి తెలియదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు షాహిద్ అఫ్రిది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఉండడం పూర్తి సమయం ఉద్యోగం కాబట్టి అతడు ఒక విషయంపై దృష్టి పెట్టాలి అని అన్నారు అఫ్రిది. దీంతో సొంత దేశం క్రికెట్ బోర్డుపై మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అతడి వ్యాఖ్యలకు కొంతమంది మద్దతు తెలుపుతుంటే.. మరి కొంతమంది మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.