Justin Bieber : హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (Justin Bieber) ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మొదట్లో పాటలు, ఆ తరువాత సెలీనాతో ప్రేమాయణం, బ్రేకప్, అనంతరం హెయిలీ బీబర్ తో పెళ్లి, పిల్లలు… ఇలా నిరంతరం బీబర్ కు సంబంధించిన ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ స్టార్ సింగర్ డివోర్స్ తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఆయన తన భార్య సోషల్ మీడియా ఖాతాను అన్ ఫాలో చేయడంతో ఈ రూమర్లకు ఆజ్యం పోసినట్టుగా అయింది.
భార్యకు డివోర్స్ ఇవ్వబోతున్నాడా?
జస్టిన్ బీబర్ (Justin Bieber) తాజాగా తన భార్య హెయిలీ బీబర్ (Hailey Bieber) ను ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయడం సంచలనంగా మారింది. గత కొన్ని రోజుల నుంచి ఈ జంట విడాకులు తీసుకోబోతుందనే రూమర్లు వైరల్ అవుతుండగా, తాజాగా ఆయన అన్ ఫాలో చేయడంతో విడాకులు ఖాయమని అంటున్నారు. కేవలం హెయిలీని మాత్రమే కాదు బీబర్ తన పాత స్నేహితుడు, సింగర్ ఆషెర్‌ను కూడా అన్ ఫాలో చేశాడు. అలాగే జస్టిన్ తన మామగారు అంటే భార్య హెయిలీ బీబర్ తండ్రి స్టీఫెన్ బాల్డ్విన్ ను కూడా అన్ ఫాలో చేశాడు. దీంతో ఈ అన్ ఫాలో పర్వం కొనసాగుతుండగా, వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఊహాగానాలు మొదలయ్యాయి. మరి జస్టిన్ బీబర్ తన భార్యని ఎందుకు అన్ ఫాలో చేశాడు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ కొన్ని రోజుల క్రితమే హెయిలీ ‘అసహ్యించుకునే పరిస్థితులు’ అంటూ చేసిన ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. కాగా బీబర్ ఆమెను అన్ ఫాలో చేసినప్పటికీ, హెయిలీ ఇంకా భర్తను ఫాలో అవుతుండడంతో అభిమానులు ఈ వార్తలు నిజం కావొద్దని కోరుకుంటున్నారు.
గత ఏడాది తండ్రి అయిన బీబర్
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొంతకాలం క్రితం జస్టిన్ (Justin Bieber) తన భార్య హెయిలీతో కలిసి ఆస్పిన్ లోయలలో వెకేషన్ ఎంజాయ్ చేశారు. కానీ డివోర్స్ రూమర్లపై ఇప్పటిదాకా బీబర్ లేదా హెయిలీ స్పందించలేదు. 2018 సంవత్సరంలో జస్టిన్ బీబర్ తన ప్రియురాలు హెయిలీని వివాహం చేసుకున్నాడు. గత ఏడాది ఆగస్టు 22న హెయిలీ – జస్టిన్ తమ మొదటి బిడ్డను స్వాగతం పలికారు. వారాసుడికి ఈ జంట జాక్ బ్లూ బీబర్ అని పేరు పెట్టారు. అంతలోపే ఈ జంట విడాకుల వార్తలు జోరుగా విన్పిస్తున్నాయి.
మాజీ ప్రేయసి ఎంగేజ్మెంట్
మరోవైపు గత సంవత్సరం డిసెంబర్‌లో జస్టిన్ (Justin Bieber) మాజీ ప్రేయసి సెలీనా గోమెజ్ (Selina Gomez) బెన్నీ బ్లాంకోతో తన నిశ్చితార్థాన్ని ప్రకటించింది. 2023 నుంచి ఈ జంట డేటింగ్ లో ఉన్నారు. సెలీనా గోమెజ్ – బెన్నీ బ్లాంకో సంవత్సరం పాటు డేటింగ్ చేశాక, 2024 డిసెంబర్ 12న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. సెలీనా వయస్సు 32 సంవత్సరాలు, బెన్నీ బ్లాంకో ఆమె కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద. అతడికి 36 ఏళ్లు. ఈ నేపథ్యంలోనే సడన్ గా బీబర్ జంట విడాకుల వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.