Michael Vaughan: టీమిండియాకు డేంజర్ బెల్స్ పంపిస్తోంది ఇంగ్లాండ్ జట్టు. 3-2 గెలుస్తామని పరోక్షంగా చెబుతోంది టీమిండియా ప్రత్యర్థి ఇంగ్లాండ్. స్వదేశంలో, విదేశాలలో సుదీర్ఘమైన టెస్ట్ పర్యటనల తర్వాత.. టీమిండియా మరో యుద్దానికి సిద్ధం అయింది. భారత్ బుధవారం అంటే నేటి నుంచే ఇంగ్లండ్‌తో T20I సిరీస్ లో పాల్గొనబోతోంది. న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా రెండింటికీ ఘోర పరాజయాల తర్వాత, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలోనే టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది.
Also Read: ICC – BCCI: జెర్సీ వివాదం…BCCIకి ICC బిగ్ షాక్..రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవు ?
ఇలాంటి తరుణంలోనే…మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ( Michael Vaughan ) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ జట్టు, ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ విజేత ఎవరో మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ జోస్యం చెప్పాడు. T20I సిరీస్‌లో ( IND vs ENG t20I Series ) సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టుపై ఆధిపత్యం చెలాయించడానికి జోస్ బట్లర్ నేతృత్వంలోని జట్టు రెడీ అయిందన్నారు మైఖేల్ వాన్. T20I సిరీస్‌లో జోస్ బట్లర్ ( Jose Butler ) నేతృత్వంలోని జట్టుకు మద్దతు ఇచ్చాడు మైఖేల్ వాన్ ( Michael Vaughan ) . T20I సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) నేతృత్వంలోని జట్టుపై 3-2 తేడాతో ఇంగ్లాండ్ సీరిస్ గెలుస్తుందన్నారు.
T20I సిరీస్ కోల్‌కతాలో ఇవాళ ప్రారంభమవుతుంది. తదుపరి మ్యాచ్‌లు చెన్నై, రాజ్‌కోట్, పూణె, ముంబైలలో జరుగుతాయి. 2021 తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇదే కావడం విశేషం. నాలుగేళ్ల క్రితం అహ్మదాబాద్‌లో జరిగిన చివరి ఎన్‌కౌంటర్‌లో భారత్ 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ తరుణంలోనే.. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే టీ20 సిరీస్ పై మైఖేల్ వాన్ ట్వీట్ చేశారు. ఈ సీరిస్ ను 3-2 తేడాతో ఇంగ్లండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని వాన్ పేర్కొన్నాడు. “ఇంగ్లండ్ 3-2తో గెలుస్తుంది” అని మైఖేల్ వాన్ ( Michael Vaughan ) X లో రాశారు. అయితే.. దీనిపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Also Read: Ind vs Eng T20: ఇవాళ్టి నుంచి ఇంగ్లాండుతో టి-20 సిరీస్.. టైమింగ్స్, ఫ్రీగా ఎక్కడ చూడాలంటే ?
ఇంగ్లండ్ 3-2తో గెలవడం కాదు.. 5-0 తేడాతో టీమిండియా గెలుస్తుందని కామెంట్స్ చేశారు టీమిండియా ఫ్యాన్స్. అదే సమయంలో మైఖేల్ వాన్ ( Michael Vaughan ) కు కౌంటర్ ఇస్తున్నారు. కాగా… ఇప్పటి వరకు ఇంగ్లండ్‌తో భారత్ ఆడిన ఐదు టీ20ల్లో మూడింటిలో విజయం సాధించింది. 2022లో, ఇంగ్లండ్ 1-2తో స్వదేశీ సిరీస్‌ను భారత్‌తో కోల్పోయింది. అయితే టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో 10 వికెట్ల తేడాతో ఓడించి పుంజుకుంది టీమిండియా. భారత క్రికెట్ జట్టు, ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసిన వెంటనే…రెండు జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.
Michael Vaughan predicts England will win the T20I series 3-2 against India 🏏
Do you agree with Vaughan? 👀#Cricket #T20 #INDvENG #India pic.twitter.com/YVnGzkMMb0
— Sportskeeda (@Sportskeeda) January 22, 2025