BigTV English

Guava Leaves: జామ ఆకులు చేసే మేలు మరేది చేయ్యలేదట..!

Guava Leaves: జామ ఆకులు చేసే మేలు మరేది చేయ్యలేదట..!

Guava Leaves: జామ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికి తెలిసిన విషయమే. ఇవి మనకు ఏడాది పొడవునా.. అంటే అన్ని సీజన్లలో లభిస్తుంది. జామ పండ్లలో విటమిన్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగాలు రాకుండా చేస్తుంది. చర్మాన్ని మెరుపును కూడా అందిస్తుంది. ఇలా జామ పండ్లతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే పండ్ల వల్లనే కాకుండా జామ ఆకులతో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. కానీ ఈ ఆకులు అనేక వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.


జీర్ణవ్వవస్థ మెరుగుదల
జామ ఆకులలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, డయాబెటిస్ సమస్య నుండి ఉపశమనం కలిపిస్తుంది. ఈ ఆకులు అతిసారం, కడుపునొప్పి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతేకాకుండా గ్లూకోజ్ శోషణను తగ్గించి, ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అలాగే జామ ఆకులలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఈ ఆకు శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ
జామ ఆకులు డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఫ్లేవనాయిడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
జామ ఆకుల టీ తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి గ్లూకోజ్ శోషణను తగ్గించి, ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.


చర్మ ఆరోగ్యం
ఈ ఆకులలోని యాంటీబాక్టీరియల్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మ సమస్యలైన మొటిమలు, ఎగ్జిమా, చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.ఇవి చర్మంపై ఏర్పడే ముడతలను తగ్గించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.
జామ ఆకులను మెత్తగా రుబ్బి, ముఖానికి మాస్క్‌గా వాడవచ్చు లేదా ఆకుల కషాయంతో చర్మాన్ని కడగవచ్చు. దీని వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. మీ ముఖం కాంతి వంతంగా అవుతుంది.

దంత ఆరోగ్యం
జామ ఆకులు దంత సమస్యలైన చిగుళ్ళ నొప్పి, దంత క్షయం, నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. ఇవి యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉండి, నోటిలో బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. నోటి పుండ్లు, చిగుళ్లు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పలు వైద్యు నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులను నమలడం లేదా వాటి కషాయంతో నోటిని శుభ్రం చేసుకోవడం ఉపయోగకరం.

గుండె ఆరోగ్యం
జామ ఆకులు రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే
జామ ఆకుల టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బరువు తగ్గడంలో సహాయం
జామ ఆకులు జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇవి కొవ్వు కరిగించడంలో, శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో ఉపయోగకరంగా ఉంటాయి.జామ ఆకుల టీని రోజూ తాగడం ద్వారా ఆకలిని అరికడుతుంది. దీంతో బరువు నియంత్రణలో సహాయం చేస్తుంది.

క్యాన్సర్ నివారణ
జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మహిళల ఆరోగ్యం
జామ ఆకులు ఋతుస్రావ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి ఋతుక్రమంలో నొప్పిని, అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు జామ ఆకుల కషాయం తాగడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు.

Also Read: రెడ్ వైన్ ఇలా వాడారంటే.! ఫేస్ క్రీమ్స్‌కు ఇక గుడ్‌బై..

జుట్టు ఆరోగ్యం
జామ ఆకులు జుట్టు రాలడాన్ని తగ్గించి, చుండ్రును నివారిస్తాయి.
ఇవి తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అలాగే జామ ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటితో తలస్నానం చేయడం ద్వారా చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.

జామ ఆకుల ఉపయోగాలు
టీ తయారీ: 4-5 జామ ఆకులను నీటిలో 5-10 నిమిషాలు మరిగించి, వడకట్టి తాగవచ్చు.
పేస్ట్: ఆకులను రుబ్బి చర్మం లేదా జుట్టుకు రాయవచ్చు.
చూర్ణం: ఆకులను ఎండబెట్టి, పొడి చేసి నీటిలో కలిపి తీసుకోవచ్చు.
నమలడం: తాజా ఆకులను నమలడం ద్వారా దంత సమస్యలు తగ్గుతాయి.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×